ఆ వీడియో చూసి పగలబడి నవ్విన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ బిజీబిజీగా ఉంటారు. పని.. పని.. ఎప్పుడూ పనిలో ఉండటమే కాకుండా తన చుట్టుపక్కలవారిచేత కూడా పనిచేయిస్తుంటారు. ఆయన నవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఒక వీడియో చూసినప్పుడు మాత్రం చంద్రబాబునాయుడు పడిపడి నవ్వారు. అంతేకాదు.. చూసినవారంతా అబ్బా.. ఎన్నాళ్టకు బాబు నవ్వారబ్బా అంటూ తెలుగు తమ్ముళ్లు కూడా ఆనందపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత కొన్ని వీడియోలను విలేకరులకు ప్రదర్శించారు.
అర్థం కాలేదని చెప్పిన అంబటి రాంబాబు
ఆ వీడియోల్లో జగన్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబుది ఉంది. అందులో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అనేది ఎంతో క్లిష్టమైందని, అంత తేలిగ్గా ఎవరికీ అర్థం కాదని, అర్థం కాదని చెబుతున్నానంటే.. తనకు కూడా అర్థం కాలేదని చెప్పారు. తాను మంత్రిగా అనేకసార్లు ఈ ప్రాజెక్టును సందర్శించి, ఎంతో స్టడీ చేసి, ఎంతోమంది సలహాదారులతో మాట్లాడిన తర్వాతే తాను ఈ మాట చెబుతున్నానని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తికాదని అర్థమైందని, ఈ మాట చెబుతున్న తొలివ్యక్తిని తానేనన్నారు.

"వీళ్ళకు పోలవరం అంటే ఒక నవ్వులాట అయిపోయింది". జగన్, అంబటి పోలవరం పై మాట్లాడిన మాటలు మీడియా ముందు చూపిస్తూ, సియం చంద్రబాబు గారు.#PolavaramProject #AndhraPradesh#NaraChandraBabuNaidu#ChandrababuNaiduAneNenu #APCMCBN #CBN4.0 pic.twitter.com/hS4K6v5f5z
— itdp gorrepadu (@ItdpGorrepadu) June 28, 2024
తమ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది
ఆ మాటలు విని, వీడియో చూసి చంద్రబాబు పగలబడి నవ్వారు. పోలవరం ప్రాజెక్టు అంటే వీరికి ఎంతో హాస్యాస్పదమైందో చూడండి అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేసిందని, వైసీపీ మాత్రం నాలుగు శాతం లోపే పనులు పూర్తిచేసిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు పూర్తి చేయకుండా డబ్బులన్నింటినీ దారి మళ్లించిందన్నారు.
గతంలో ఏదైతే ఎత్తు ఉందో అంతే ఎత్తుకు తాము కడతామన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నిర్వాసితుల జాబితాలు మార్చి వాటిని దొంగిలించారని చంద్రబాబునాయుడు జగన్ పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పడిన కష్టం మొత్తాన్ని జగన్ ప్రభుత్వం బూడిదలో పోసిన పన్నీరులా చేసిందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications