విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతమైన డిజైన్స్.. 'ఫ్యూచర్' అమరావతి: బాబు ఓకె చేసింది వీటినే?..

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి డిజైన్లను ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఓకె చేసినట్లు తెలుస్తోంది. హైరైజ్ బిల్డింగ్ రూపంలో నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్స్ ను ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం.

Recommended Video

అమరావతి13 డిజైన్లు విడుదల : రాజమౌళి సూచనల ప్రకారం.. | Oneindia Telugu

అమరావతి డిజైన్లు: నార్మన్ ఫోస్టర్ బృందానికి డైరెక్టర్ రాజమౌళి సలహలుఅమరావతి డిజైన్లు: నార్మన్ ఫోస్టర్ బృందానికి డైరెక్టర్ రాజమౌళి సలహలు

అయితే వీటిపై తుది నిర్ణయం విషయంలో ప్రజల అభిప్రాయాలను కూడా కోరనుంది ప్రభుత్వం. ఇందుకోసం సీఆర్డీయే(క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ)లో డిజైన్లను అందుబాటులో ఉంచారు. డిజైన్లపై వెబ్ సైట్ ద్వారా ఎవరైనా సరే ప్రభుత్వానికి సలహాలు-సూచనలు ఇవ్వవచ్చు.

AP CM okays Foster’s Amaravati designs

ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన డిజైన్లు మాత్రం అద్బుతంగా ఉన్నాయనే చెప్పాలి. గతంలో చేసిన డిజైన్లను చంద్రబాబు తిరస్కరించగా.. తాజాగా మరో మూడు డిజైన్లతో కూడిన ఫైల్ ను సీఎం వద్దకు పంపించింది. వీటిల్లో పై ఫోటోలోని డిజైన్లను చంద్రబాబు ఓకె చేసినట్లు సమాచారం.

అమరావతిలోని పాలవాగుకి సమీపంలో సీఎం కార్యాలయ భవనం, దానికి ఎదురుగా నాలుగు మూలల్లో నాలుగు టవర్స్ ఉండేలా ప్లాన్ చేసినట్లు డిజైన్లలో కనిపిస్తోంది. ఈ డిజైన్లకు సంబంధించిన ఏరియల్ వ్యూ చిత్రాలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి.
మిగతా నాలుగు టవర్స్ తో పోలిస్తే సీఎం కార్యాలయ భవనం ఒకింత ఎత్తుగానే కనిపిస్తోంది.

కాగా, గత నెలలో లండన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అమరావతి డిజైన్లపై సీఎం చంద్రబాబు సంస్థ ప్రతినిధులతో సమాలోచనలు జరిపిన తెలిసిందే. ప్రపంచంలోని 10అత్యుత్తమ భవనాల నమూనాలను సేకరించి వాటిని తలదన్నే రీతిలో భవనాలు ఉండాలని సూచించారు. అందుకు తగ్గట్లే నార్మన్ ఫోస్టర్స్ భవనాలను డిజైన్ చేసింది.

English summary
The marathon exercise relating to the designing of iconic structures in Amaravati, AP state capital, appears to have reached its logical end after a long wait.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X