షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సీఎం జగన్ దంపతులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
Recommended Video

ఆ తర్వాత తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్‌లను ఆత్మీయంగా పలకరించారు వైఎస్ జగన్. అనంతరం వైఎస్ జగన్-భారతి దంపతులు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి వరకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.

కాగా, హైదరాబాద్ నగరంలోని గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. ఇరు కుటుంబాలు, బంధువుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో అప్లైడ్ ఎకనామిక్స్, ప్రిడిక్టివ్ అనాలటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది.

కాగా, ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇప్పటికే వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తదితర రాజకీయ, సినీ ప్రముఖులను వైఎస్ షర్మిల తన కుమారుడి నిశ్చితార్థంతోపాటు వివాహ వేడుకకు ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications