YS Jagan in Niti Aayog Meet : నీతి ఆయోగ్ భేటీలో కేంద్రానికి జగన్ చెప్పిందిదే..!
ఇవాళ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇందులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఓవైపు ఏపీ అభివృద్ధిని ప్రస్తావిస్తూనే మరోవైపు కేంద్రం తీసుకోవాల్సిన చర్యల్ని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతిపై ఓ నోట్ ను కూడా కేంద్రానికి సమర్పించారు. జగన్ ప్రస్తావించిన అంశాలపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలని సీఎం జగన్ ఇవాళ నీతి ఆయోగ్ భేటీలో కేంద్రాన్ని కోరారు. తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుందన్నారు.భారతదేశంలో లాజిస్ట్రిక్స్ ఖర్చు చాలా ఎక్కవుగా ఉందని, లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉందని గుర్తుచేశారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందన్నారు. అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5 శాతమే ఉందని తెలిపారు.

గత తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేస్తోందన్నారు. ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయని జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిందని, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోందని తెలిపారు.
దేశ జీడీపీలో తయారీ, సేవల రంగం వాటా 85% దాటినప్పుడే 'వికసిత్ భారత్' లక్ష్యం నెరవేరుతుందని జగన్ తెలిపారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5% అని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారరంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమన్నారు.
విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించిందని జగన్ తెలిపారు. రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతున్నాయన్నారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని జగన్ తెలిపారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధుల భారం గురించి తెలుసుకోవాలన్నారు. గుండెజబ్బులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుందన్నారు. కాబట్టి హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలన్నారు.
ఏపీ ప్రభుత్వం 10,592 గ్రామ మరియు వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసిందని, ఇందులో ఒక మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ఏఎన్ఎం, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచామని జగన్ తెలిపారు. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు,14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. రెండున్నర సంవత్సరాల కాలంలో, రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించిందని తెలిపారు. విలేజ్ క్లినిక్‌ల నుండి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్ ఉండేలా చూసుకున్నామన్నారు..












Click it and Unblock the Notifications