ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్న సినిమా ఏమిటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు బాలకృష్ణ అభిమానిగా ఉండేవారనే విషయం తెలిసిందే. ఉమ్మడి కడప జిల్లాకు బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. బాలయ్య సినిమా విడుదలైనప్పుడు థియేటర్లను భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేసేవారు. పేపర్లలో ఇచ్చిన యాడ్లు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి.
బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతో ఆయన నటించిన సీమ సింహం చిత్రాన్ని రాయలసీమ ఏరియాకు వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. అయితే అది విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో జగన్ భారీగా నష్టపోయారు.తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆయనతో గొడవ పడి మరీ ఈ చిత్రాన్ని కొన్నారు. అయితే ఒక్క రూపాయి కూడా రాలేదు. దీనితర్వాత ఆ కటుంబం సినిమాలవైపే చూడలేదు.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. దసరా పర్వదినంరోజు ఇది విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. కాజల్ కథానాయిక కాగా, శ్రీలీల ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారు. ఈ చిత్రానికి ఇటీవలే ప్రారంభోత్సవం చేశారు. హీరోయిన్లు, ఇతర నటులు ఖరారు కావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications