వాలంటీర్లే నా సైన్యం - నాడు మాట ఇచ్చాను, చేస్తాను : సీఎం జగన్..!!

ఏపీలో వాలంటీర్లు అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసించారు. ప్రభుత్వ వారధులు..సంక్షేమ సారధులు వాలంటీర్లు అని కొనియాడారు. తాను నమ్ముకున్న సైన్యం వాలంటీర్ల వ్యవస్థ అని సీఎం పేర్కొన్నారు. తన ప్రభుత్వ ఫిలాసఫీకి వాలంటీర్లు ప్రతిరూపమని చెప్పుకొచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపమంట అని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను చులకనగా చూసారని చెప్పారు. ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా సీఎం జగన్ పేర్కొన్నారు.

వలంటీర్లకు వందనం : వ‌రుస‌గా మూడో ఏడాది వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. ఉత్తమ వలంటీర్లకు అవార్డులు ప్రదానంతో పాటు సత్కరించనున్నారు. వలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు అందజేసారు. ఈ సమయంలో జగన్ కీలక ప్రసంగం చేసారు. తాను నమ్మకం పెట్టుకున్నది వాలంటీర్ల వ్యవస్థ పైనే అని స్పష్టం చేసారు.

 jaganvolunteers-

లంచాలు, అవినీతి లేని తులసి వ్యవస్థ వాలంటీర్లు అని జగన్ చెప్పుకొచ్చారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారు చేస్తుంది స్వచ్చంద సేవని సీఎం వివరించారు. ప్రతీ వాలంటీరు స్వచ్చందంగా ప్రజా సేవ కోసం వచ్చిన వారనేని ప్రశంసించారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లు అంబాసిడర్లుగా పేర్కొన్నారు.

వాలంటీర్లను లీడర్లను చేస్తా : వాలంటీర్లను లీడర్లను చేస్తానని గతంలో తాను చెప్పిన అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేసారు. ప్రజా సంక్షేమంలో వాలంటీర్లు మోటివేటర్లుగా పని చేస్తున్నారని వివరించారు. చంద్రబాబుకు వాలంటీర్ల వ్యవస్థ అంటే చులకన భావం ఉందన్నారు. వాలంటీర్లు అంటే చంద్రబాబుకు కడుపు మంటని చెప్పిన చంద్రబాబు, ఎన్ని మందులు వేసినా అది తగ్గదన్నారు.

 jaganvolunteers-

వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలను తీసుకొస్తామంటున్నారని వివరించారు. కోర్టులు వెళ్లి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ ఇంటికి ఎక్కువగా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించాలని సూచించారు. గతానికి, ఇప్పటికీ తేడా చూపించాలని కోరారు.

ఎప్పటికీ అడ్డు ఉండదు : వాలంటీర్లు వ్యవస్థ జగన్ సైన్యమని.. జన్మభూమి కమిటీలతో కొత్త సైన్యం తీసుకొస్తామని చంద్రబాబు చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతీ ఇంట్లో గతంలో ఏం జరిగిందీ.. ఇప్పుడు ఏ రకంగా మంచి చేస్తుందీ వివరించాలన్నారు. తాను దేవుడి దయ..ప్రజల దీవెన కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో ఆలోచన వచ్చేలా వాలంటీర్లు వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాలు వాలంటీర్లకు దురుద్దేశా లు ఆపాదిస్తున్నారన్నారు. అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పటికీ అడ్డు ఉండదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+