కేసీఆర్ పై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు-సీఎంవో వార్నింగ్ ..!

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చిచ్చు రేపుతోంది. రోజుకో ములుపు తిరుగుతున్న ఈ వ్యవహారంలో ఇవాళ కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ ప్రేవేటీకరణపై ముందుకెళ్లడం లేదని చెప్పేశారు. ప్రస్తుతానికి ప్లాంట్ ను బలోపేతం చేయడంపైనే దృష్టిపెట్టామన్నారు. అయితే ఈ ప్రకటనకు కాసేపు ముందు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా ఇదే అంశంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో తీవ్ర విమర్శలు చేశారు.

హరీష్ రావు కూడా తన మామ కేసీఆర్ లాగా ఫాంహౌస్ లో కూర్చుని కల్లుతాగిన కోతిలా మాట్లాడుతున్నాడని, మా దగ్గర లిక్కర్ స్కాంలు వంటివి లేవని ఏపీ మంత్రి అప్పలరాజు తెలిపారు. అలాంటి చాట్లు కూడా లేవంటూ కవిత చాటింగ్ ను గుర్తుచేసారు.హరీష్ రావు మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకు మాట్లాడాలంటూ సీదిరి రెచ్చిపోయారు. సిగ్గూఎగ్గూ లేకుండా ప్రైవేటీకరణ చేస్తే బిడ్ వేస్తామంటావా అంటూ ప్రశ్నించారు. దానర్ధం ప్రైవేటీకరణకు నువ్వు అనుకూలమా వ్యతిరేకమా అని అడిగారు.

 appalarajukcr

బంగారు తెలంగాణ అంటూ తెచ్చుకుని దొరల పాలనలో ఏం జరుగుతోందంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మరింత రెచ్చిపోయారు. నువ్వో మంత్రి, నీ మామ ముఖ్యమంత్రి, ఆయన కొడుకో మంత్రి.. మీరంతా ప్రాంతీయ ఉగ్రవాదులు, పనికిమాలిన మాటలు ఆపి పని చూసుకోండన్నారు. ఆంధ్రా వాళ్లు తెలంగాణ రావడం మానేస్తే అడుక్కు తినడం తప్ప ఏమీ ఉండదన్నారు. ఇంకా తెలంగాణ వాళ్లు బుర్ర తక్కువ వాళ్లు అంటూ వ్యాఖ్యానించారు.

appalaraju

ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎంవో అప్రమత్తమైంది. మంత్రి సీదిరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎంవో పెద్దలు ఆయన్ను సుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. అప్పలరాజు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎంవో.. ఇకపై ఇలాంటి పరుష వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు సమాచారం. మరి సీఎంవో సూచన తర్వాత అయినా మంత్రి వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+