విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగం లేదు కానీ వార్షికాదాయం 36 లక్షలు: సర్వేలో అడిగిన ప్రశ్నలకు బాబు జవాబు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా సాధికార సర్వే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి ప్రజాసాధికార సర్వే అధికారులు ఏడబ్ల్యూకేపీ 2963 నెంబర్‌ను కేటాయించారు.

గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలోని లింగమనేని హౌస్ లో ఉంటున్న చంద్రబాబు వద్దకు వివరాల సేకరణకు నిన్న ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికార యంత్రాంగంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు వేసిన అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సవివరంగా సమాధానం చెప్పారు.

సర్వేలో భాగంగా సీఎం నుంచి 80 ప్రశ్నలకు వివరాలు సేకరించిన అధికారులు వాటిని సరిచూసుకున్న తర్వాత ఆయన ఇంటికి శాశ్వత నెంబర్‌ను కేటాయించారు. ప్రస్తుతం తాను, తన కుమారుడు లోకేశ్ మాత్రమే ఇంట్లో ఉంటున్నామని ఇద్దరి వివరాలు తీసుకుని మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యుల వివరాలు తర్వాత తీసుకోవాలని సర్వే అధికారులను కోరారు.

సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వేలి ముద్రలను, ఐరిస్ ఫోటోలను సర్వే అధికారులు సేకరించారు. సర్వే అధికారులకు వివరాలు ఇచ్చే సందర్భంలో చంద్రబాబు పలుమార్లు సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సర్వేలో అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు కింది విధంగా సమాధానాలు చెప్పారు.

ఆధార్ కార్డు నెంబరు: 300300688099
నివాసం : ఆర్సీసీ శ్లాబ్ (ప్రభుత్వ క్వార్టర్)
విస్తీర్ణం : 5 వేల చదరపు అడుగులు
శాశ్వత నివాసం ఉందా?: లేదు
ఎలక్ట్రానిక్ ఉపకరణాలు: ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్ తదితరాలన్నీ
పెళ్లైందా?అయ్యింది.
పెళ్లి నాటికి వయసు: 30 ఏళ్లు
చదువు : ఎంఏ (ఆర్థిక శాస్త్రం)
ఎక్కడ: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
ఉద్యోగం: లేదు
వృత్తి : రాజకీయం
ప్రస్తుత హోదా : ముఖ్యమంత్రి
వార్షికాదాయం: రూ.36 లక్షలు

English summary
Andhra Pradesh government will conduct a 'Smart Pulse Survey' for collecting socio-economic data of 1.48 crore households in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X