ఓపిక పట్టాం-శక్తి నశించింది : ఆస్తులు కరిగి..అప్పుల్లో: ఏపీలో కాంట్రాక్టర్ల ఆందోళన..!!
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీలోని దశల వారీగా నగరాల్లో ఆందోళన నిర్శహిస్తున్నారు. తాజాగా విశాఖలో ఆవేదన-4 నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి పలువురు కాంట్రాక్టర్లు నల్ల చొక్కాలతో నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజారు కాక..బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. వేధింపులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్త చేసారు.

కాంట్రాక్టర్ల ఆవేదన
నాడు తాము పనులు నిర్వహించి ఎంతో మందికి ఉపాధి కల్పించామని, కానీ ప్రస్తుతం తాము ఉపాధి కోల్పోయామంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో ఆస్తులు కరిగి..అప్పులు తమకు మిగిలాయంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు ఓపిక పట్టామని... ఇక ఆ శక్తి నశించిపోయిందం టూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లవ్యవస్థను నిర్వీర్యం చేసారని సంఘ నేతలు ఆరోపించారు. తాము టెండర్ల నిబంధనలను పాటించి ఆ మేరకు పనులు పూర్తి చేసామని..కానీ, ప్రభుత్వం మాత్రం బిల్లులు ఇవ్వటం లేదని వాపోయారు.

రోడ్లపైకి తీసుకొచ్చారు
గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఇదే రకమైన సమస్య వస్తే..అప్పుడు ఆయన వద్దకు వెళ్లి సమస్య వివరించగానే.. ప్రత్యేకంగా జీవో ఇచ్చి నిధులు మంజూరు చేసారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తమ బాధలను పట్టించుకోకపోవటంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత కాంట్రాక్టర్లు వాపోయారు.నాడు-నేడు, జల్‌జీవన్ మిషన్ పనులకూ డబ్బులు చెల్లించలేదని, ముఖ్యమంత్రి దశలవారీగా నిధులు విడుదల చేస్తే... వాటిని మళ్లీ ఇతర పనులకే ఉపయోగిస్తామని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తాము పూర్తి చేసిన పనులను సైతం ఇప్పటి వరకూ బిల్లుల మంజూరు కాలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

కార్యాచరణ ఖరారు
చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి మొత్తంగా వెయ్యి కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని..వాటిని పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదంటూ ఆక్రోశించారు. ఇక, నుంచి ఆందోళనలో భాగంగా బకాయిలు చెల్లించాల్సిన కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటతో పాటుగా..అన్ని విభాగాల కాంట్రాక్టర్లు బిల్లుల సాధనలో భాగంగా ఒకే తాటి పైకి రావాల్సిన అవసరం ఉందని నిరణయించారు. కొంత మందికి మాత్రం బిల్లులు మంజూరు చేయటం పైన నిరసనలో పాల్గొన్న కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ











Click it and Unblock the Notifications