వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 4,228 కొత్త కేసులు ,10 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా నమోదయ్యాయి .కరోనా సెకండ్ వేవ్ దేశంలో దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి . ఇక ఏపీలోనూ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 4,228 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో కరోనా ఉధృతి : గత 24 గంటల్లో 3,263 కొత్త కేసులు ,11 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!ఏపీలో కరోనా ఉధృతి : గత 24 గంటల్లో 3,263 కొత్త కేసులు ,11 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి , మొత్తం కేసుల సంఖ్య 9,32,892

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి , మొత్తం కేసుల సంఖ్య 9,32,892

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నమోదైన మొత్తం కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 9 ,32,892 . గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 7321 కి చేరుకుంది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 25, 850 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. కరోనా మహమ్మారి బారిన పడి కోలు కున్న వారు ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 , 99,721 మంది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 842 కేసులు , అత్యల్పంగా పశ్చిమగోదావరి లో 48 కేసులు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 842 కేసులు , అత్యల్పంగా పశ్చిమగోదావరి లో 48 కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన మరణాలలో చిత్తూరు జిల్లా నుంచి నలుగురు, నెల్లూరు లో ఇద్దరు, కృష్ణా ,గుంటూరు ,కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు . ఇక గత 24 గంటల్లో నమోదైన కేసులో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 842 కేసులు, ఇక అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.

 గత 24 గంటల్లో జిల్లాల వారీగా కేసుల వివరాలివే

గత 24 గంటల్లో జిల్లాల వారీగా కేసుల వివరాలివే

ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులను చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 842 కేసులు నమోదు కాగా, గుంటూరులో 622 కేసులు, కృష్ణాజిల్లాలో 261 కేసులు, విశాఖపట్నం జిల్లాలలో 414 కేసులు , శ్రీకాకుళంలో 271 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 334 కేసులు, నెల్లూరు జిల్లాలో 268 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 88 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 538 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో భారీగా కేసుల పెరుగుదల.. ఆంక్షలు విధిస్తారా ?

ఏపీలో భారీగా కేసుల పెరుగుదల.. ఆంక్షలు విధిస్తారా ?

అనంతపురం జిల్లాలో 128 కేసులు, ప్రకాశం జిల్లాలో 284 కేసులు ,విజయనగరం జిల్లాలో 130 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 48 కేసులు నమోదయ్యాయి. ఆయా జిల్లాలలో పెరుగుతున్న కేసుల తీరు మరింత ఆందోళన కలిగిస్తుంది . ఇక ఏకంగా నిన్నటి వాసులకు ఆందోళన కలిగిస్తుంది. మొత్తానికి రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఏపీలో భయాందోళనలు నెలకొన్నాయి.


ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షల దిశగా నడుస్తున్న వేళ ఏపీలో కరోనా కట్టడికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి .

English summary
The massive increase in corona cases in AP is a cause for tension . In the last 24 hours, 4,228 people have been infected 10 people died. The highest number of 842 cases was reported in Chittoor district and the lowest was 48 cases in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X