లడ్డు వ్యవహారం హిందూ ధర్మంపై జరిగిన ఆర్గనైజ్డ్ క్రైమ్..
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై జరిగిన చర్చలో టీడీపీ ఎమ్మెల్సీ, మండలి ఛీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిందని, కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకుందని ఆమె మండిపడ్డారు. ఇది కేవలం నెయ్యి కల్తీ వ్యవహారం మాత్రమే కాదని, పక్కా ప్రణాళికతో హిందూ ధర్మంపై జరిగిన 'ఆర్గనైజ్డ్ క్రైమ్' అని ఆమె అభివర్ణించారు. టెండర్ నిబంధనలను తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టేలా ఏ విధంగా తుంగలో తొక్కారో ఆమె లెక్కలతో సహా సభ ముందు ఉంచారు.
టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలను వివరిస్తూ.. గతంలో ఉన్న కఠినమైన నిబంధనలను వైసీపీ ప్రభుత్వం తన స్వార్థం కోసం నీరుగార్చిందని అనురాధ ఆరోపించారు. నెయ్యి సరఫరా చేసే సంస్థలకు ఉండాల్సిన మూడేళ్ల అనుభవాన్ని ఏడాదికి కుదించారని, అలాగే రూ. 250 కోట్లుగా ఉండాల్సిన వార్షిక టర్నోవర్ నిబంధనను రూ. 150 కోట్లకు తగ్గించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనను కూడా సడలించారని, ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నాసిరకం నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు టెండర్లు ఇచ్చారని విమర్శించారు. ఈ నిబంధనల సడలింపు దస్త్రంపై అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతకం ఉండటమే దీనికి నిదర్శనమని ఆమె గుర్తు చేశారు.

నెయ్యి నాణ్యతను పరీక్షించే విషయంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేశారని, భయంకరమైన రసాయనాలు కలిసిన మిశ్రమాన్ని ఆవు నెయ్యి పేరుతో వినియోగించారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ (NDDB) ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ వాస్తవమని తేలిపోయిందని, ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి అని ఆమె పేర్కొన్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని, కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే కాకుండా ప్రభుత్వ పెద్దలే దీనికి సూత్రధారులని ఆమె ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ.. లడ్డూ కల్తీ కేసులో 'ఏ1 జగన్ మోహన్ రెడ్డి, ఏ2 భూమన కరుణాకర రెడ్డి, ఏ3 వైవీ సుబ్బారెడ్డి, ఏ4 ధర్మారెడ్డి, ఏ5 చెవిరెడ్డి భాస్కరరెడ్డి' అంటూ వరుసగా పేర్లను ప్రస్తావించారు. అయితే, ఈ పేర్ల ప్రస్తావనపై మండలి ఛైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్నప్పుడు.. సీబీఐ పరిధిలోని అంశాల్లో ఇలా పేర్లను ప్రస్తావించడం సరికాదని హితవు పలికారు. ఆమె చేసిన ఈ వ్యక్తిగత ఆరోపణలను సభ రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్ తక్షణమే ఆదేశించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications