ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడులు-180 కేసులు, 8.5 కోట్ల ఫైన్
ఏపీలో కోవిడ్ పరిస్ధితుల్ని సొమ్ముచేసుకుంటూ రోగుల్ని వేధిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై టాస్క్‌పోర్స్ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌పోర్స్ నిర్వహిస్తున్న దాడుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల దందా బయటపడుతోంది. దీంతో భారీగా కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం జరుగుతోంది.
ఏపీలో కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. సీఎం జగన్ దాదాపు ప్రతీ సమీక్షలోనూ ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులపై మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో కోవిడ్ నిబంధనలు పాటించకుండా భారీగా ఫీజులు వసూలు చేయడం, అనుమతుల్లేకుండానే కోవిడ్ వైద్యం చేయడం, కోవిడ్ రోగుల్ని వేధించడం వంటి అక్రమాలను గుర్తించారు.

కోవిడ్ చికిత్స పేరుతో రోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్ 180 కేసులు నమోదు చేసింది. వీటిలో చాలా మటుకు అధికంగా ఫీజుల వసూలు, అనుమతుల్లేని వైద్యం వంటివే ఉన్నాయి. వీరి నుంచి 8.5 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేసింది. కోవిడ్ చికిత్సలో అక్రమాలు చేస్తూ మొదటిసారి పట్టుబడితే జరిమానా, రెండోసారి పట్టుబడితే క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టాస్క్‌ఫోర్స్ ముందుగా జరిమానాలు విధిస్తోంది. అత్యధికంగా కృష్ణాజిల్లాలో 52 ఆస్పత్రులపై 3.61 కోట్ల జరిమానా విధించారు.












Click it and Unblock the Notifications