చంద్రబాబు వల్లే జల వివాదాలు-జగన్ సూపర్ సీఎం- డిప్యూటీ సీఎం ధర్మాన కామెంట్స్
ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న నదీ జలాల వివాదానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు ఆనాడు పాదయాత్రలో ప్రజలు సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్ నవరత్నాల అమలులో, మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలలో 95శాతం అమలు చేసి సూపర్ సీఎం గా పేరు తెచ్చుకున్నారన్నారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్లు గుర్తెరగాలన్నారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మాజీ రెవెన్యూ మంత్రి, పస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నేరడి బ్యారేజీ రెండవ దశ కు కృషి చేశారని, నేడు అన్ని ప్రాజెక్టులతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్ని నీటి వనరులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. తమ పార్టీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేరడి బ్యారేజీని సందర్శించారని, రెండో దశ ను త్వరలోనే పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆద్వర్యంలో తోటపల్లి, బహుదా ప్రాజెక్టులతోపాటు ఆఫ్షోర్ రిజర్వాయర్ను కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణదాస్ తెలిపారు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయినందున రైతులకు నీటి వనరులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధిని చేద్దామని జగన్మోహన్రెడ్డి తెలియజేశారన్నారు.

ప్రజలకు చేరువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, తన కుమారుడు లోకేష్ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ సీఎం జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. వైపీపీపై టీడీపీ చేస్తున్న విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని, ఇదివరకే ప్రజలు బుద్ధిచెప్పారని టీడీపీ నాయకులు గుర్తెరగాలన్నారు. టీడీపీ నాయకులు చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ తప్పులన్నారు. మీడియా ప్రతినిధులు కూడా వాస్తవికతను పరిశీలించి వార్తలు రాయలన్నారు. తాను తప్పుచేస్తే పెద్ద హెడ్లైన్స్లో రాయాలని, ఎవరి మెప్పుకోసమో వాస్తవికతను దాచి తప్పుడు రాతలు రాయొద్దని కోరారు.












Click it and Unblock the Notifications