లోకేష్, భువనేశ్వరితోనే చంద్రబాబుకు ముప్పు ! డిప్యూటీ సీఎం షాకింగ్..!
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.తాజాగా జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఇవాళ మండిపడ్డారు. చంద్రబాబు తప్పు చేసి దొరికిపోయినా పట్టుకోకూడదనే ధోరణి ఎంత దుర్మార్గమని కొట్టు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనాన్ని ముందు పరీక్షించాలని కొట్టు సూచించారు. అన్ని పదార్ధాలు ఒక్కో స్పూన్ తిన్నాకే ఆయనకు పెట్టాలన్నారు.
పవన్ కళ్యాణ్ పాత చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబులో ఓ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉంటారని, మాజీ సీఎం అధికార పార్టీపై నిందలేసేందుకు జనాన్ని రెచ్చగొడుతుంటాడని, కొడుకు నాన్నా ఎంత బాగా యాక్ట్ చేశావని అంటాడన్నారు. తండ్రి ఇప్పుడే ఏం చూశావ్, ఆ తర్వాత చాలా చూస్తావంటాడు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల్లో సానుభూతి కోసం తండ్రిని తలగడ మొహంపై పెట్టి ఊపిరి ఆడనివ్వకుండా చంపేస్తాడన్నారు. తండ్రి చావుతో సానుభూతి వస్తే సీఎం అవుతానని కొడుకు అనుకుంటాడన్నారు.

ఇప్పుడు లోకేష్ కూడా తనకు తాను ఓటేసుకుని గెలిచే సత్తా లేదని కొట్టు తెలిపారు. వీళ్లు జైల్లో ఉన్న చంద్రబాబును కూడా కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా తరహాలో ఆయన భార్య, కుమారుడు చంపేస్తారన్నారు. భువనేశ్వరి తన తండ్రి చావుకు కారణమైన భర్తను ఒక్క మాట కూడా అనలేదన్నారు. ఇప్పుడు మాత్రం భర్త విషయంలో రాజకీయాలు చేస్తోందన్నారు. అవసరమైతే కొడుకు కోసం అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే లోకేష్, భువనేశ్వరి బాధ్యత వహించాలన్నారు.
చంద్రబాబు 67 కేజీలుంటే భువనేశ్వరి, లోకేష్ 6 కేజీలు తగ్గిపోయారని ప్రచారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ప్రజలు ఎటు పోయినా వీరికి అవసరం లేదన్నారు. టీడీపీ, జనసేన కుమ్మక్కై తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని, ఈ రెండు పార్టీల్ని తరిమి కొట్టాలని కొట్టు ప్రజలకు సూచించారు. వీళ్లకు ప్రజల ఆరోగ్యం కన్నా జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉందన్నారు.












Click it and Unblock the Notifications