AP politics: ఇది దేవుడికి, రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల రాజకీయాలు కొనసాగుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నాటి నుంచి ఈ వార్ మరింత ముదిరింది. ముఖ్యంగా వైసీపీ నేతలు, మంత్రులు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందని పేర్కొన్న ఏపీ మంత్రులు పేదల పక్షాన జగన్, పక్షాన చంద్రబాబు పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజాగా తవణంపల్లి మండలం గాజులపల్లిలో 60 కోట్ల రూపాయలతో నిర్మించిన జి ఎస్ ఆర్ ఫుడ్ ఫ్యాక్టరీ ను ప్రారంభించిన అనంతరం ఆయన చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దేవుడికి, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు పక్షాన జగన్, రాక్షసుల పక్షాన చంద్రబాబు యుద్ధం చేస్తున్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని నారాయణస్వామి తెలిపారు. చంద్రబాబుకు పదవీ దాహం తప్ప మరో దాహమే లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు.

చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు పట్టించుకోవడం మానేశారని పేర్కొన్న ఆయన మొదట మేనిఫెస్టోలు పెట్టడం, గెలిచిన తర్వాత మాయ చేయడం చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. ఔరంగజేబుకు చంద్రబాబుకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చంద్రబాబును టార్గెట్ చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు సంక్షేమం అందుతుందన్నారు.












Click it and Unblock the Notifications