మోడీ హృదయంలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక స్థానం!!

అధికారం పదవి తనకి కొత్తని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అయినప్పటికీ తాను కీలక శాఖలు తీసుకున్నానని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు తాను తీసుకున్న శాఖలలో విధివిధానాలు రూపొందించిన తర్వాత బాధ్యతలను వేరే వారికి అప్పగించి తప్పుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సన్మాన సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీ హృదయంలో నేను ఉన్నా
దేశం మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ ను గౌరవించేలాగా జనసేన పార్టీకి విజయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ హృదయంలో తనకు ప్రత్యేక స్థానం ఉందని, అవసరమైనప్పుడు తప్పనిసరిగా ప్రధానిని కలుస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మోడీ పక్కన నిల్చుని ఫోటో తీసుకోవాలని కోరుకోనన్నారు. ఇంతకు ముందు తాను ప్రధాని మోడీతో కేవలం 60 సెకండ్లు మాత్రమే మాట్లాడానని, బిజీగా ఉన్న వారి సమయాన్ని వృధా చేయకూడదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

AP Deputy CM Pawan Kalyan key comments on pm modi and warning to janasena leaders

తప్పకుండా మోడీని ఇవి అడుగుతా
తన స్వార్థానికి తాను ఏమీ అడగనని, ఇప్పటివరకు ప్రధానిని ఏమీ అడగలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతానని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, విశాఖ రైల్వే జోన్ కావాలని, 20 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జనసేన ఎన్డీయే కూటమికి బలమిచ్చింది
జనసేన ఏపీ ప్రజలకు ఊతం అవ్వటమే కాకుండా ఎన్డీఏ కూటమికి కూడా బలాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను కూడా మంత్రిగా బిజీగా ఉంటున్నానని, ప్రజా సమస్యలకు సంబంధించి ఎలాంటి అజెండా ఉన్న రెండు మూడు వారాల ముందే ఫిక్స్ చేసుకొని జనసేన పార్టీ నేతలు వస్తే కలుస్తానని, సడన్ గా వచ్చి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నారు.

జనసేన నాయకులకు కర్తవ్య బోధ చేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల కర్తవ్యాన్ని హితబోధ చేసిన పవన్ కళ్యాణ్, జనసేన భవిష్యత్తు ఉన్న పార్టీ అని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు, అన్ని నియోజకవర్గాలలోని నాయకులు ఐదేళ్ల ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. జనసేన నాయకులకు ఈ సందర్భంగా కీలక సూచనలు చేసిన పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చెయ్యొద్దన్నారు.

జనసేన నాయకులకు అల్టిమేటం
కొందరు నాయకులు రౌడీయిజాన్ని నమ్మకున్నారని, వారికి వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది మెతక స్వభావం ఉన్న నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి వైఖరి మార్చుకోవాలి అన్నారు. వైసిపి లాంటి గుండా పార్టీని ఎదిరించి వచ్చిన వాడినని, తనకు ఎవరన్నా భయం లేదని స్పష్టం చేశారు. అట్లాంటి వాళ్ళని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+