Pawan kalyan: పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసేలా పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా తన పైన ఉన్న బాధ్యతను అనుక్షణం గుర్తు చేసుకుంటూ పని చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను వింటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తన శాఖలతో పాటు, జనసేన మంత్రుల శాఖలలో ప్రజల నుంచి నేరుగా సలహాలు సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజాక్షేత్రంలో సమస్యలను నేరుగా చూస్తున్న ప్రజల నుంచే ఆ సమస్యల పరిష్కారానికి కావలసిన సలహాలను, సూచనలను గ్రహించాలని భావించిన పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

AP Deputy CM Pawan Kalyan sensational decision to involve people in governance with google forms

గూగుల్ ఫామ్ ద్వారా సలహాలు, సూచనలు కోరుతున్న పవన్ కళ్యాణ్
ఎవరైనా సరే పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌరసరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ ను ఫిల్ చేయాలని సూచించారు. ఇక ఈ మేరకు పవన్ కళ్యాణ్ మొదలెట్టిన కొత్త సాంకేతిక ప్రక్రియ ఏపీలో పవన్ నిర్వహించే శాఖలలో పురోగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

పాలనలో టెక్నాలజీ వాడుతున్న పవన్ కళ్యాణ్
ఇక ఈ ఫామ్ కు సంబంధించిన లింకును జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పాలనలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ఏపీ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

పాలనలో పవర్ స్టార్ మార్క్
ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి పరిష్కార మార్గాలను అన్వేషించడానికి కావలసిన సలహాలు సూచనలకు గూగుల్ ఫామ్ ఏ మేరకు పవన్ కళ్యాణ్ కు పాలనలో ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది. దీనిని ఎంతమంది ప్రజలు ఉపయోగిస్తారో.. దీనివల్ల ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయో అన్నది భవిష్యత్తులో తేలనుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పాలనలోనూ పవర్ ఫుల్ నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+