షాకింగ్ : ప్రజలు జగన్ పై దాడి చేసే రోజులొస్తాయి; ఏపీ డిప్యూటీ సీఎం వీడియో వైరల్; రచ్చ షురూ !!
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయి అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. పవన్ పైన ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. పొరపాటున నోరు జారారు. పవన్ కళ్యాణ్ ను తిట్టబోయి తమ పార్టీ అధినేతపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులో కాలేశారు.ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎం నోరుజారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు తమ్ముళ్ళ చేతికి చిక్కింది. ఇంకేం ఆయన వ్యాఖ్యలతోనే ట్రోలింగ్ మొదలైంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. పవన్ పై వ్యాఖ్యలు
ఇంతకీ ఏం జరిగిందంటే ఈరోజు తిరుమల శ్రీవారిని విఐపి ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి శ్రీ వారి మొక్కులు చెల్లించుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక పవన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు.

జగన్ ను విమర్శించే అర్హత పవన్ కు లేదన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
వైసీపీని, సీఎం జగన్ ను విమర్శించే అర్హత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేదని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జడ్పిటిసి, ఎంపిటిసి మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. కులాలతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కులాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.
పవన్ ను టార్గెట్ చెయ్యబోయి జగన్ పైనే ఇలా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం పవన్ కళ్యాణ్ ఎన్నో ప్రయత్నాలు చేశారని, అయినా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను దగ్గరకు కూడా రానివ్వలేదు అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి పై నోరుజారి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయి జగన్ ను ఉద్దేశించి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
నారాయణస్వామి ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేస్తూ, జగన్ దాడి చేయడం ఏమిటి? ప్రజలే దాడి చేస్తారు.. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజులు రాబోతున్నాయి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పొరబాటుగా వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ ..మనసులో మాట చెప్పారు అంటూ ట్రోల్
పవన్ కళ్యాణ్ ను అనబోయి ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీ లీడర్స్ లో జగన్ పై అసంతృప్తి, ఆగ్రహం పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే డిప్యూటీ సీఎం నారాయణస్వామి జగన్ మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజు వస్తుంది అంటూ మనసులో మాట బయటపెట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజులు వస్తాయని ఏడుకొండల వెంకన్న సాక్షిగా డిప్యూటీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారని ట్రోల్ చేస్తూ తెలుగు తమ్ముళ్ళు పోస్టులు పెడుతున్నారు.
ప్రజలే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే రోజులు రాబోతున్నాయని మరోక సారి ఏడు కొండల సాక్షిగా టంగ్ స్లిప్ అయిన ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి. pic.twitter.com/SjyW5iVYe1
— iTDP Mantralayam (@itdpmantralayam) September 29, 2021
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications