వెయిటింగ్ ఐపీఎస్ లకు డిజీపీ మార్క్ షాక్..!!

ఏపీ డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హాయంలో నాడు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వారిలో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ తో సహా మరో 15 మంది ఉన్నారు. ఇప్పుడు వారి విషయంలో డీజీపీ తాజాగా మెమోలు జారీ చేసారు.

రాష్ట్రంలో వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని వారికి మెమోలు ఇచ్చారు. పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్నీ, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజులకు ఈ మెమోలు జారీ అయ్యాయి.

AP DGP latest orders for waiting IPS officers becomes viral details here

వీరంతా ఇక నుంచి ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. రోజూ హెడ్‌ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని తెలిపారు. ఈ తరహా ఆదేశాలు ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన పీఎస్సార్ ఆంజనేయులు తాజాగా చంద్రబాబు సీఎం అయిన తరువాత రెండు సార్లు కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. అదే విధంగా చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన రఘురామిరెడ్డి ప్రయత్నించారు. కానీ, అవకాశం ఇవ్వలేదు.

ఈ అధికారులు పూర్తిగా నాటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వీరి పైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా డీజీపీ ఇచ్చిన మెమోల వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+