ఏపీ డీజీపీ సాంబశివరావుకు తృటిలో తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తణుకు పదహారో నెంబరు జాతీయ రహదారిపై డీజీపీ సాంబశివరావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనకే వస్తోన్న కాన్వాయ్ లోని వాహనం ఢీకొంది. ఈ క్రమంలో కాన్వాయ్ లోని వాహనాలు కూడా ఒకదానినొకటి ఢీకొన్నాయి. డీజీపీ వాహనం సహా కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. డీజీపీ సాంబశివరావు వెంటనే మరో వాహనంలో విజయవాడ వెళ్లిపోయారు. డీజీపీ కాన్వాయ్ కాకినాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications