వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిష్ణా జిల్లాకు రోజా - విశాఖకు రజనీ : ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం - జగన్ ఎంపిక వెనుక..!!

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ 2024 ఎన్నికలే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళన పూర్తి చేసిన సీఎం జగన్...పార్టీ బాధ్యతల ప్రకటన ముందుగా..ప్రభుత్వంలో కీలకమైన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులను ఖరారు చేసారు. కొత్త మంత్రులకు జిల్లాలను కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రులకు 26 జిల్లాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అయితే, జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రుల ఎంపిక విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందులో భాగంగా టీడీపీ తమకు గట్టి బలం ఉన్న జిల్లాగా చెప్పుకొనే క్రిష్ణా జిల్లాకు ఇప్పుడు ఇన్ ఛార్జ్ మంత్రిగా రోజాకు ఆ జిల్లాను కేటాయించారు. ఇక, ఒక్క మంత్రి కూడా లేని విశాఖ జిల్లాకు తొలి సారి మంత్రి అయిన విడదల రజనీకి ఇన్ ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాగా, చంద్రబాబు సొంత జిల్లా బాధ్యతలను ఉషశ్రీకి కేటాయించారు.

మంత్రులు -జిల్లాల కేటాయింపు

మంత్రులు -జిల్లాల కేటాయింపు


ఇక, మంత్రులు - ఇన్ ఛార్జ్ లుగా నియమించిన జిల్లాలు... ధర్మాన - గుంటూరు, సిదిరి అప్పలరాజు - కాకినాడ, బొత్సా సత్యనారాయణ - శ్రీకాకుళం, రాజన్న దొర -అనకాపల్లి, గుడివాడ అమర్నాధ్ కు రెండు జిల్లాల బాధ్యతలు ఖరారు చేసారు. అల్లూరి సీతారామ రాజు జిల్లాతో పాటుగా పార్వతీ పురంకు ఆయన ఇన్ ఛార్జ్ గా వ్యవహరించనున్నారు. ముత్యాలనాయుడు - విజయనగరం,దాటిశెట్టి రాజా - పశ్చిమ గోదావరి, విశ్వరూప్ - ఏలూరు, చెల్లుబోయిన వేణు - తూర్పు గోదావరి, తానేటి వనిత -ఎన్టీఆర్ జిల్లా, కారుమూరు నాగేశ్వర రావు పల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా వ్యవహరించనున్నారు.

మహిళా మంత్రులకు కీలక జిల్లాలు

మహిళా మంత్రులకు కీలక జిల్లాలు


కొట్టు సత్యనారాయణ - బాపట్ల, జోగిరమేష్ - అమలాపురం, మేరుగ నాగార్జున - ఒంగోలు, విడదల రజనీ -విశాఖ, అంబటి రాంబాబు - నెల్లూరు, ఆదిమూలపు సురేష్ - కడప జిల్లాకు ఇన్ ఛార్జ్ గా నియమితులయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి -అన్నమయ్య, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - అనంతపురం, ఆర్కే రోజా - క్రిష్ణా జిల్లా, నారాయణ స్వామి - తిరుపతి, అంజద్ బాషా - నంధ్యాల, బుగ్గన రాజేంద్రనాధ్ - కర్నూలు, జయరాం - సత్యసాయి, ఉషశ్రీ చరణ్ - చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ -విజయవాడ బాధ్యతల్లో రజనీ -రోజా

విశాఖ -విజయవాడ బాధ్యతల్లో రజనీ -రోజా


అయితే, అనూహ్యంగా మహిళా మంత్రులకు కీలక జిల్లాలు కేటాయించారు. పార్టీ రీజనల్ - జిల్లా బాధ్యులను సీఎం జగన్ ఖరారు చేసారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా వీరికి జిల్లాలను అప్పగించిన సీఎం జగన్..ఇక, పార్టీ పదవుల ప్రకటన తరువాత..జిల్లాల వారీగా పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయంతో మంత్రులు - పార్టీ అధ్యక్షులు పని చేయాల్సి ఉంటుంది. దీంతో..ఇక, వచ్చే ఎన్నికల కోసం జగన్ జిల్లాల వారీగా బాధ్యతల కేటాయింపు పూర్తి కానుంది.

English summary
CM Jagan had appointed District incharge ministers. Roja will be the incharge minister for Krishna district while Vidadala Rajini for Visakhapatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X