హైదరాబాదులో ఎపి ఎంసెట్ సెంటర్లు: గంటా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంసెట్‌కు తెలంగాణలోని హైదరాబాదులో ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విద్యార్థులకు అనువైన ప్రదేశాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జెఎన్‌టియు ఈ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తుందని చెప్పారు.
హైదరాబాదులో ఎపి ఎంసెట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఈ సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాల ఎంపిక చేస్తామన్నారు. హైదరాబాద్‌లో సుమారు 30వేల మంది విద్యార్థులు హైదరాబాద్‌లో పరీక్ష రాస్తారని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. ఈషా సంస్థకు భూముల కేటాయింపులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు.

తక్షణమే పరిష్కరిస్తాం...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో గలనీరుకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు రైతులతో కలిసి వ్యవసాయ భూములను చదును చేశారు.గ్రామకంఠాలు, భూమి సర్వే సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రులు ఈ సందర్భంగా చెప్పారు.
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం...
వచ్చే ఖరీఫ్‌కు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న ప్రాజెక్టులను వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు చెప్పారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications