AP EAPCET -2026 ఫలితాల ప్రకటన పై తాజా నిర్ణయం..!!

AP EAPCET-2026 పై కీలక అప్డేట్. ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్ధులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ ఫలితాలు తొలుత ఈ నెల 1వ తేదీనే విడుదల చేస్తారని భావించారు. అయితే, విడుదల ఆలస్యం అవుతోంది. ఇందుకు అధికారులు స్పష్టమైన కారణాలను వెల్లడించారు. దీంతో, ఇప్పుడు ఫలితాల విడుదల కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలపై కీలక సమాచారం అందుతోంది. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రిజల్ట్స్ వాయిదా పడటంతో మరికొంత కాలం ఎదురుచూడక తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 1న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ మూడో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల నిబంధనల ప్రకారం, ఈఏపీసెట్ ర్యాంకును కేటాయించేటప్పుడు కేవలం ప్రవేశ పరీక్ష మార్కులను మాత్రమే కాకుండా, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కేటాయిస్తున్నారు.

 'తల్లికి వందనం' నిధుల విడుదల పై తాజా నిర్ణయం, అర్హుల జాబితా- కీలక మార్పు..!!
'తల్లికి వందనం' నిధుల విడుదల పై తాజా నిర్ణయం, అర్హుల జాబితా- కీలక మార్పు..!!
ap-eapcet-2026-results-are-now-expected-to-be-announced-only-after-june-18-here-the-details

ఈ నెల 18న ఫలితాల వెల్లడికి ఛాన్స్

ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రాకుండా ఈఏపీసెట్ ర్యాంకులు ప్రకటిస్తే.. ఇంప్రూవ్‌మెంట్ రాసే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ర్యాంకుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని భావించిన అధికారులు ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జూన్ 1న ఫలితాలు ప్రకటిస్తే, ఇంప్రూవ్‌ మెంట్, సప్లిమెంటరీ ఫలితాల తర్వాత మార్కులు పెరిగితే ప్రస్తుతం విద్యార్థులకు కేటాయించిన ర్యాంకుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. ఇదే జరిగితే కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం తలెత్తుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నత విద్యామండలి అధికారులు.. విద్యార్థులలో ఎవరికీ అన్యాయం జరగకుండా, సమానంగా, పారదర్శకంగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈఏపీసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో, తాజాగా ఫలితాలు జూన్ 18న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+