ఏపీలో టి హవా.. హైదరాబాద్‌లో ఇబ్బందిపడుతుంటే తెలంగాణ అధికారా?: బాబుకు షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడిచినా ఏపీలో ఇంకా తెలంగాణ హవా కొనసాగుతుండటంపై అధికారులు, అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇదీ జగన్ మాట: ప్రశాంత్ కిషోర్ తాజా వ్యూహం, రివర్స్ అవుతోందా?

ముఖ్యంగా కీలకమైన అసెంబ్లీ కార్యదర్శి నియామకంపై ఆంధ్ర ఉద్యోగులు, అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

ఇది మరో చరిత్ర, ఇన్నోవా కార్లు ఇస్తున్నాం: బాబు, అక్కడే జగన్ దెబ్బ తిన్నారు

ఆ పదవికి అర్హులైన ఏపీ అధికారులున్నప్పటికీ, ప్రభుత్వం తెలంగాణకు చెందిన అధికారిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తోందని ఉద్యోగులు, అధికారులు నిరసన తెలుపుతున్నారు.

రామాచార్యులు వెంకయ్య వద్దకు వెళ్లడంతో

రామాచార్యులు వెంకయ్య వద్దకు వెళ్లడంతో

ఇటీవలి కాలం వరకూ అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేసిన రామాచార్యులు ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు కార్యాలయంలో చేరడంతో ఆ పదవి ఖాళీ అయింది. అయితే రామాచార్యులు ఢిల్లీకి వెళ్లే ముందు ఎవరికీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించలేదు. ప్రస్తుతం అసెంబ్లీకి కార్యదర్శి లేకుండా పోయారు. అంతకుముందు వరకూ ఇంచార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సత్యనారాయణ ఉన్నప్పటికీ ఆయనకూ బాధ్యతలు ఇవ్వలేదు.

అప్పుడు ఢిల్లీలో బాధ్యతలు

అప్పుడు ఢిల్లీలో బాధ్యతలు

ఇదిలా ఉండగా, తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందంటూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సర్వీసుతో సంబంధం లేకుండా ప్రసార భారతి ఉద్యోగి అయిన ప్రసన్న.. సిపిఎం నేత సోమనాథ్ చటర్జీ స్పీకర్‌గా ఉన్న సమయంలో లోకసభ, రాజ్యసభ నుంచి ప్రసారభారతికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాల బాధ్యతలు చూసేవారు.

అరవింద్ కేజ్రీవాల్ పిలిచి మరీ

అరవింద్ కేజ్రీవాల్ పిలిచి మరీ

ఆ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రసన్నను పిలిచి ఢిల్లీ అసెంబ్లీలో నియమించారు. మళ్లీ ఇప్పుడు ప్రసన్నను ఒక సామాజిక వర్గానికి చెందినవారు ఏపికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారని, కేవలం సామాజికవర్గ కోణంలోనే ఏపీకి తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు ఏపీకి తీసుకు వచ్చే

ఇప్పుడు ఏపీకి తీసుకు వచ్చే

ఓ కేంద్రమంత్రి, మరొకరి ద్వారా ఆయనను ఏపీ అసెంబ్లీకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆ పదవికి ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సత్యనారాయణతో పాటు లా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అర్హులని, అయినా వారిద్దరినీ పరిగణనలోకి తీసుకోకపోవడం ఏమిటంటున్నారు. సత్యనారాయణ రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్ల పాటు ఇంచార్జిగా వ్యవహరించారు.

వారికీ దక్కకుండా పోతోంది

వారికీ దక్కకుండా పోతోంది

లోకసభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్న వారికే లేని లా అర్హత అసెంబ్లీకి వర్తింపచేయడం వల్ల సత్యనారాయణ పూర్తిస్థాయి కార్యదర్శి కాలేకపోయారని కొందరు అంటున్నారు. మరో ఇద్దరికి ఇప్పటి వరకు జాయింట్ సెక్రటరీ ప్రమోషన్ ఇవ్వకపోవడంతో వారికీ కార్యదర్శి హోదా దక్కకుండా పోయిందంటున్నారు.

తెలంగాణలో ఇబ్బంది పడుతుంటే, అక్కడి వారికా

తెలంగాణలో ఇబ్బంది పడుతుంటే, అక్కడి వారికా

ఓవైపు ఏపీకి చెందిన అధికారులు తెలంగాణలో ఇబ్బందులు పడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణకు చెందినవారిని కేవలం సామాజిక కోణంలో నియామకాలు చేస్తుండటంపై ఉద్యోగులలో అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు.

తెలంగాణ అధికారి పర్యవేక్షణలో పని చేయలేం

తెలంగాణ అధికారి పర్యవేక్షణలో పని చేయలేం

కాగా, ప్రసన్న కుమార్ నియామక యత్నాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ఉద్యోగులు సంఘం కొద్దిరోజుల క్రితం రిలీవైన రామాచార్యులును కలసి వినతిపత్రం అందజేసింది. తెలంగాణ అధికారి పర్యవేక్షణలో తాము పనిచేయలేమని ఉద్యోగులు స్పష్టం చేశారు. ప్రసన్నను నియమించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే సామూహిక సెలవు, పెన్‌డౌన్ వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని అసెంబ్లీ ఉద్యోగులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆలయ పాలకవర్గాల్లోనూ తెలంగాణ నేతలను నియమిస్తుండటంపై రాష్ట్ర టిడిపి నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణకు చెందిన కొందరు తమ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh employees and officers unhappy with Chandrababu Naidu government for Telangana assembly secretary.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి