Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రహ్మంగారి మఠాధిపతిపై త్వరలో నిర్ణయం: జీవసమాధిని దర్శించిన మంత్రి వెల్లంపల్లి

కడప: త్వరలోనే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాన్ని శుక్రవారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలు సందర్శించారు. ఆలయ అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

జీవసమాధిని దర్శించుకున్న వెల్లంపల్లి.. చర్చలు

జీవసమాధిని దర్శించుకున్న వెల్లంపల్లి.. చర్చలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన తర్వాత పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరితో విడివిడిగా చర్చలు జరిపారు. మఠం నివాసంలో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మతో మాట్లాడారు. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. అందరూ ఏకాభిప్రాయానికి రావాలని కోరినట్లు చెప్పారు.

బ్రహ్మంగారి మఠాధిపతిపై త్వరలో నిర్ణయమన్న వెల్లంపల్లి..

బ్రహ్మంగారి మఠాధిపతిపై త్వరలో నిర్ణయమన్న వెల్లంపల్లి..

మూడు రోజుల్లో వారే స్వయంగా కూర్చుని మాట్లాడుకుందామని చెప్పారని మంత్రి తెలిపారు. శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదని, వారిని దేవాదాయ శాఖ పంపంచిందనడం అవాస్తవమన్నారు. దేవాదాయశాఖకు పీఠాధిపతుల బృందానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పీఠాధిపతి నిర్ణయం కొలిక్కి రాకపోతే దేవాదాయ శాఖ, ధార్మిక పరిషత్ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి స్పస్టం చేశారు.

బ్రహ్మంగారి మఠాధిపతి వివాదం..

బ్రహ్మంగారి మఠాధిపతి వివాదం..


వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో పదేళ్ల క్రితం ఆయన రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి(53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి(9)ల మధ్య పీఠాధిపత్యంలో పోటీ నెలకొంది. కాగా, గోవిందస్వామి మేజర్ అయ్యేంత వరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోటీలోకి రావడం వివాదం నెలకొంది. సుమారు నెల రోజులకుగాపై ఈ వివాదం కొనసాగుతుండటంతో మంత్రి శుక్రవారం ఇక్కడికి వచ్చి సమీక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+