విద్యుత్ ఛార్జీలపై జగన్ వి తప్పుడు ప్రచారాలే..! తేల్చేసిన మంత్రి గొట్టిపాటి రవి..!

ఏపీలో విద్యుత్ శాఖపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. జగన్ వి అన్నీ తప్పుడు ప్రచారాలన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో యూనిట్ రూ.9.30 కి కొనుగోలు చేశారని, యాక్సిస్ ఒప్పందంతో రైతుల‌కు ఉపాధి, యువ‌త‌కు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ ఐదేళ్ల‌లో విద్యుత్ ఛార్జీల్ని తొమ్మిదిసార్లు పెంచారని ఆరోపించారు. వైసీపీ హ‌యాంలో రూ.1.29 ల‌క్ష‌ల కోట్ల రుణ భారం విద్యుత్ శాఖపై పడిందన్నారు.

యాక్సిస్, బ్రూక్ ఫీల్డ్ కంపెనీతో కూట‌మి ప్ర‌భుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల‌పై అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం లో సెకీ నుంచి రూ.2.49కి విద్యుత్ కొనుగోలు చేసామనేది పచ్చి అబద్ధమని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. విద్యుత్ సరఫరా నష్టాలు , ఇతర ఖర్చులన్నీ కలిపితే యూనిట్ కు రూ.5 పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు.

ap energy minister gottipati ravi strong counter to ys jagan over misleading on power charges

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కూట‌మి ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌పై జ‌గ‌న్ అన‌వస‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని మంత్రి గొట్టిపాటి మండిప‌డ్డారు. అత్య‌ధిక విద్యుత్ వినియోగం జ‌రిగే స‌మ‌యంలో ఒత్తిడిని త‌ట్టుకునేందుకు, ప్ర‌జ‌ల‌కు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఒప్పందాలు ఎంతో ఉప‌యోగప‌డ‌తాయ‌ని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందాల‌తో రాయ‌ల‌సీమ ప్రాంతంలో 400 మోగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తితో పాటు రాష్ట్ర యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా పీక్ అవర్స్ లో కూడా యూనిట్ రూ.4.60కే విద్యుత్ దొరుకుతుందని విద్యుత్ మంత్రి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి హయాంలో 2022 లో రూ.5.12కు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే..తమ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ను రూ.4.60కి తగ్గించి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. 1,700 ఎక‌రాలను రైతుల‌ నుంచి తీసుకుని వారికి ఏడాదికి రూ.31 వేలు కౌలు అందిస్తున్నామని వెల్లడించారు. అంతేగాక రాష్ట్రానికి యాక్సిస్ ఎనర్జీ నుంచి 9 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం ల‌భిస్తుంద‌న్నారు.

యాక్సిస్ ఎనర్జీ తన పెట్టుబడులను ఏపీలో పెట్టిందని, వీటి ద్వారా విద్యుత్ కొనుగోళ్లు చేస్తుండటంతో విద్యుత్ సరఫరా నష్టాలు లాంటివి ఉండవని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఇటువంటి ఒప్పందాల ద్వారా విద్యుత్ ఛార్జీలు త‌గ్గించి ప్ర‌జ‌ల‌పై భారం లేకుండా చేయాల‌న్న‌ది సీఎం చంద్రబాబు ఆలోచ‌న అన్నారు. . పెట్టుబడిదారుల్ని తరిమికొట్టిన చరిత్ర జగన్ ది అయితే, పెట్టుబడులు ఆహ్వానించి రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ ఉపాధి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుది అన్నారు.

విభజన తర్వాత సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ గా మార్చార‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ గుర్తుచేశారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా వైసీపీకి అప్ప‌గిస్తే, 2019-2024 వ‌ర‌కు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేశార‌న్నారు. షార్ట్ టైం ప‌వ‌ర్ ప‌ర్చేజ్ పేరుతో ఒక్క సంవ‌త్స‌రంలోనే రూ.10వేల కోట్లు ఖర్చు చేసి ప్ర‌జ‌ల నెత్తిన మోయ‌లేని భారాన్ని మోపార‌న్నారు. ఏపీ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీల‌ను పెంచార‌ని గుర్తు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచ‌లేద‌న్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+