మరోసారి విద్యుత్ ఛార్జీల పెంపు - రూ 9,412 కోట్ల భారం, ఎవరి పై ఎంత..!!
ఏపీలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పెంపు రెండో సారి. డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. డిసెంబర్ నెల నుంచి వినియోగదారుల పైన రూ 9,412 కోట్ల మేర భారం పడనుంది. సర్దుబాటు చార్జీలను యూనిట్‌కు 92 పైసలు చొప్పున 2026 నవంబరు వరకూ వసూలు చేయనున్నారు. తాజా నిర్ణయంతో వినియోగదారుల పై మరింత భారం పడనుంది.
విద్యుత్ ఛార్జీల బాదుడు
ఏపీలో విద్యుత్ వినియోగదారుల పై మరింత భారం మోపే నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ట్రూ అప్‌తో పాటు రెండు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పిపిసిఎ) ఛార్జీలతో నడ్డివిరుస్తున్న విద్యుత్ సంస్థలు మరోసారి భారం మోపుతున్నాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్ర ణ మండలి అనుమతి లభించింది. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఛార్జీల పెంపుకు సంబంధిం చి ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.12,844 కోట్లు సర్దుబాటు చేసేందుకు ఈఆర్‌సీకి డిస్కం లు ప్రతిపాదనలు పంపాయి.

ఈఆర్సీ అనుమతితో
అందులో రూ.3,432 కోట్లుకు కోత విధించిన ఈఆర్‌సీ... మిగిలిన రూ.7,912 కోట్లు (వ్యవసాయ సబ్సిడీ రూ.1,500 కోట్లు పోను) ప్రజల నుంచి వసూలు చేసుకొనేందుకు ఆమోదం తెలిపింది.తాజాగా అనుమతి రావటంతో ఇక, ఈ సర్దుబాటు చార్జీలను యూనిట్‌కు 92 పైసలు చొప్పున వచ్చే నెల (డిసెంబరు) నుంచి 2026 నవంబరు వరకూ వసూలు చేయాలని డిస్కం లకు ఈఆర్సీ సూచించింది. ఈఆర్సీ అనుమత మేరకు డిస్కంలు ప్రతినెలా 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లు డిస్కంలు వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి.
పెంపు ఎక్కడ ఎంత
మిగిలిన రూ.6,543.60 కోట్లను వచ్చే డిసెంబర్ నుంచి 2026 నవంబర్ వరకూ వసూలు చేసుకోవాలని ఈఆర్సీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఎస్‌పిడిసిఎల్) పరిధిలో యూనిట్‌కు 0.9132 పైసలు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిసిపిడిసిఎల్) పరిధిలో 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్) పరిధిలో 0.9049 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఆరు నెలల కాలంలో ప్రజల పైన వరుసగా రెండో సారి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ భారం మోపటం పైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
-
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications