వీడియోతో అడ్డంగా బుక్ అయిన ఏపీ మాజీ మంత్రి.. ఫుల్ వైరల్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు హీట్ ఎక్కించాయి. ఈ వ్యవహారం లోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒకే వ్యక్తి చాలా ఓట్లు వేస్తున్నట్టు కనిపించింది. పోలీసులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని ఆయన ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. సదరు వీడియోని వైసీపీ కార్యకర్తలు సైతం రీపోస్ట్ చేయడంతో ఫుల్ వైరల్ అయ్యింది.

ఫ్యాక్ట్ చెక్ రివీల్..!

ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపిన వివరాలు ప్రకారం.. అంబటి రాంబాబు పోస్ట్ చేసిన వీడియోలో కనిపించిన బ్యాలెట్ పత్రాలు పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో ఉపయోగించిన వాటికి సరిపోలలేదని తెలిపింది. ఈ వీడియోను అప్పట్లోనే సుధాంశు వేది అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు.

ap-ex-minister-ambati-rambabu-post-video-about-pulivendula-by-election

ఈ వీడియోను ఉపయోగించి డీఐజీ స్థాయి అధికారిపై కుట్రపూరిత ఆరోపణలు చేయడం, ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకాన్ని దెబ్బతీయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం కిందికి వస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫేక్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పులివెందుల, ఒంటిమిట్ట ఫలితాలు..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీ అధినేత జగన్ సొంత ఊరులోనే పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైకాపా అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి కేవలం 683 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు. అలానే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగరేశారు.

కోర్టు తీర్పు..

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాలంటూ వైసీపీ అభ్యర్థులు వేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే ఎన్నికల పిటిషన్ (EP) దాఖలు చేసుకోవాలని, వీటికి విచారణార్హత లేదని న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. వైసీపీ అభ్యర్ధుల తరఫున సీనియర్ న్యాయవాదులు పి. వీరారెడ్డి, శ్రీరామ్ వాదనలు వినిపించారు. జిల్లా కలెక్టర్ ముందు దొంగ ఓటర్లు ఓటు వేశారని వాదన వినిపించగా.. వారు దొంగ ఓటర్లని కలెక్టర్‌కు ఎలా తెలుసు?" అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+