ఏపీలో వెయ్యి దాడులు, 31హత్యలు!!

ఆంధ్రప్రదేశ్‌లో నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వినుకొండలో జరిగిన ఘటనతో దేశమంతా ఉలిక్కిపడిందని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.

ఏపీలో దాడులపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం
టిడిపి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, వెయ్యికి పైగా దాడులు జరిగాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 35 మందిని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించారని 300కు పైగా హత్యాయత్నాలు చేశారని లెక్కలతో ఏకరువు పెట్టారు. నిన్న వినుకొండలో జరిగిన దారుణ ఘటన దేశాన్ని కుదిపేసిందని, నడిరోడ్డుపై జనం, పోలీసులు ఉండగానే రెండు చేతులు అమానుషంగా నరికి ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Ex Minister Gudivada Amarnath targets chandrababu over attacks and murders

చంద్రబాబు ఈ ఘటనలపై స్పందించాలి
ఈరోజు ఎంపీ మిధున్ రెడ్డిపై పుంగనూరులో రాళ్ల దాడి చేశారని మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారని నిప్పులు చెరిగారు.
45 రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఈ దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాప్రయత్నాల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిన్న, ఈరోజు జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలని, వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విజయసాయిపై వచ్చిన ఆరోపణలపై ఆగ్రహం
ఎంపీ విజయసాయిరెడ్డి పై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. గిరిజన మహిళ, అధికారిణికి సంబంధించి ఆమె భర్త ఓ లేఖ రాశారని, అంటే అందులో ప్రముఖంగా పేరు ఉందని ఎవరికి పడితే వారికి అంటగట్టేస్తే కోపం రాదా? అని ప్రశ్నించారు. అధికారిణి వచ్చి క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డకు ఫలానా వ్యక్తి తండ్రి అని చెప్పిన తర్వాత కూడా రాద్దాంతం చేయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో దాడులు, వ్యక్తిత్వ హననాలు
ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయని, ఏది పడితే అది మాట్లాడటం సబబు కాదన్నారు. సెన్సిటివ్ విషయాలను ప్రస్తావించేటప్పుడు గౌరవంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కావాలని కక్ష సాధింపు చర్యలలో భాగంగా వైసిపి నేతలపైన దాడులు కొనసాగుతున్నాయని వ్యక్తిత్వ హననం జరుగుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

జగన్ అండగా ఉంటారు.. ఆందోళన వద్దు
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఏపీలో తాజా పరిణామాలను చూస్తూ కూడా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసిపి కార్యకర్తలు ప్రస్తుతం జరుగుతున్న దాడులపై ఆందోళన పడవద్దని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాడని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+