భారీగా తగ్గింపు - ఏపీ ఎక్సైజ్ శాఖ బంపరాఫర్..!!

ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బార్ పాలసీ ప్రకటించిన తరువాత ఒక్క సారిగా మద్యం వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పాలసీ నిబంధనలపై మద్యం వ్యాపారుల్లో వ్యతిరేకత ఉంది. జిల్లాల వారీగా ముందుగానే సమావేశాలు నిర్వహించుకున్న వారు.. పాలసీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పాలసీపై ప్రతికూలత ఏర్పడుతుందని గ్రహించిన ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఇప్పుడు వ్యాపారులు ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది.

ఎక్సైజ్ శాఖ ఆఫర్
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన బార్ పాలసీ మేరకు లైసెన్సు ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లైసెన్స్ ఫీజును తగ్గించడంతో పాటు ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ పాలసీ బార్ లైసెన్సీలకు లాభదాయకంగా మారనుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతంలో బార్ లైసెన్స్ దారులు ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి వచ్చేది. బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుతో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కాగా.. కడపలో బార్ లైసెన్స్ ఫీజు గతంలో రూ. 1.97 కోట్లు ఉండగా, ఇప్పుడు దానిని రూ. 55 లక్షలకు తగ్గించారు. అదేవిధంగా అనంతపురంలో లైసెన్స్ ఫీజు రూ. 1.79 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గించారు.

AP Excise reduced tenders fee for new bars as govt decision details here

ఒక్క దరఖాస్తు లేదు
అదే విధంగా తిరుపతిలో రూ. 1.72 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు, ఒంగోలులో రూ. 1.4 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గించినట్లు వెల్లడి ఎక్సైజ్ కమిషనర్ వెల్లడించారు. లైసెన్స్‌ దారులు ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఉంది. కొత్త బార్ విధానంలో దరఖాస్తు రుసుమును రూ. 5 లక్షలకు తగ్గించారు. బార్లలో మద్యం అమ్మకాల వేళలను పెంచారు. దీని ద్వారా లాభదాయకంగా ఉంటుందని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఈ పాలసీ పైన వ్యాపారుల్లో ఆసక్తి కనిపించటం లేదు. నూతన పాలసీ మేరకు ఈనెల 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా.. 50 మంది రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. కానీ రూ.5 లక్షల రుసుము ఎవరూ చెల్లించలేదు. దీంతో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.

ఫీజుల తగ్గింపుతో
కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 840 బార్లకు కనీసం నాలుగు చొప్పున అంటే 3,360 దరఖాస్తులు రావాలి. గతేడాది మద్యం షాపుల పాలసీ సమయంలో ఏ షాపునకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. దానివల్ల ఎక్కడ పోటీ తక్కువ ఉందో.. ఆ షాపులకు కొత్తవారు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల సంఖ్య అందరికీ కనిపించకుండా వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే వివరాలు కనిపించేలా చేశారు. పాలసీ వ్యాపారులకు అనుకూలంగా ఉందని, విస్తృత ప్రచారంతో వీలైనంత ఎక్కువ దరఖాస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో.. అసలు ఈ బార్ పాలసీ లో ప్రస్తుతం ఫీజులు తగ్గింపుతో ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+