మందుబాబులు కోరుకున్న విధంగా - బ్రాండ్లు, పాలసీలో కీలక మార్పులు..!!
ఏపీలో మందుబాబులకు కిక్కు ఇచ్చే న్యూస్ ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. రూ 99 కే క్వార్టర్ మద్యం అమ్మకాలకు భారీ డిమాండ్ పెరిగింది. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది. ఇక.. ఇప్పుడు కొత్త బార్ పాలసీ కి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసారు. ఇందులో బార్లలో అమ్మకాల వేళలను పెంచుతూ నిర్ణయించారు. అదే విధంగా బ్రాండ్ల విషయం లోనూ స్పష్టత ఇచ్చారు.
ఏపీలో నూతన బార్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు రూపాల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు గడువుగా నిర్ణయించారు. 28న ఉదయం లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేస్తామని, సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. కాగా, బార్ పాలసీలో అనేక మార్పులు తీసుకొచ్చారు. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీచేయగా, అందులో 10శాతం(84 బార్లను) గీత కులాలకు ప్రభుత్వం కేటాయించింది. వాటికి బుధవారం నోటిఫికేషన్ జారీచేసి, 30న లాటరీ నిర్వహించనున్నారు. గీత కులాల బార్లకు 50శాతం లైసెన్స్ ఫీజు ఉంటుంది. సాధారణ బార్లకు జనాభా ఆధారంగా రూ.35 లక్షలు, రూ.55 లక్షలు, రూ.75 లక్షలు చొప్పున లైసెన్స్ ఫీజులు నిర్ణయించారు.

గత బార్ పాలసీలో వేలం విధానం వల్ల చాలా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.కోటి దాటింది. ఈసారి ఒకే లైసెన్స్ ఫీజు ఉండేలా లాటరీ విధానం తీసుకొచ్చారు. దరఖాస్తు రుసుం గతంలో మూడు కేటగిరీల్లో రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు ఉండగా, ఇప్పుడు అందరికీ ఒకే విధంగా రూ.5లక్షలు చేశారు. బార్ వ్యాపారంలోకి కొత్తవారు రావాలనే ఉద్దేశంతో ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరి చేసారు. దీనివల్ల గుత్తాధిపత్యం తగ్గుతుందని అధికారులు చెప్పారు.
లైసెన్స్ ఫీజు ఆరు విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పించానే. కాగా, ఇక బార్ల పని వేళలను ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు కాకుండా ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ బార్లలో రూ 99 మద్యం అమ్మకాలు ఉండవు. మద్యం అమ్మకాల సమయం పెంపు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications