వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమిలిలో పరిపాలన రాజధాని : విజయసాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిని విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గ కేంద్రంలో పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. సీఎం నిర్ణయంతో భీమిలి అభివృద్ది చెందనుందని అన్నారు...దీంతో సీఎం నిర్ణయానికి అనుగుణంగా స్థానిక ప్రజలు ,నాయకులు సహకరించాలని ఆయన కోరారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా పాల్గోన్న విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు ఆది నుండీ రాజధాని కష్టాలే .. శాశ్వత రాజధానే లేని ఏపీ ప్రస్థానం ఇదే !!ఆంధ్రప్రదేశ్ కు ఆది నుండీ రాజధాని కష్టాలే .. శాశ్వత రాజధానే లేని ఏపీ ప్రస్థానం ఇదే !!

 భీమిలిలో పరిపాలన రాజధాని

భీమిలిలో పరిపాలన రాజధాని

అయితే అంతకు ముందే విశాఖ జిల్లోని భీమిలీ నియోజకవర్గంలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సీఎం ప్రకటించారని, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం బావించారని అయితే దాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతంగా ఉందనే ఆలోచనతో విశాఖలో రాజధాని నిర్మించాలని సీఎం సంకల్పించారని చెప్పారు. దీంతో బీమిలిలోనే రాజధాని నిర్మాణాలు చేపడతారనే సంకేతాలను ఇచ్చారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పూర్తిగా స్వాగతించారని అన్నారు.

 పరిపాలన వికేంద్రీకరణ చేయాలని జీఎన్ రావు కమిటీ

పరిపాలన వికేంద్రీకరణ చేయాలని జీఎన్ రావు కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అధికార వికేంద్రీకరణ జరగాలని సూచించడంతో రాజధానిపై చర్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా... విశాఖలో సేక్రటేరియట్‌తో పాటు, సమ్మర్ అసెంబ్లీ, సీఎం క్యాంప్ కార్యాలయంలోతోపాటు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించిన విషయం తెలిసిందే...దీంతో ఈ కమిటీ ప్రతిపాదనలను క్యాబినెట్‌లో చర్చించి అమోదం పొందించనున్నట్టు మంత్రులు ప్రకటించారు.

భీమిలికి మహార్థశ

భీమిలికి మహార్థశ

విజయసాయి రెడ్డి ప్రకటనతో బీమిలి అంత్యంత ప్రాధాన్యత గల ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది. మారుమూల ప్రాంతంగా ఉన్న బీమిలీ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద ఓటర్లు గల నియోజకవర్గంగా గుర్తింపు పోందింది. అయితే నిన్నటి వరకు విశాఖ నగరంలో సెక్రటేరియట్ నిర్మిస్తారని భావించారు. విశాఖ రాజధాని ప్రకటనను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు కూడ స్వాగతించారు. కాని అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి ప్రకటనతో మరో కొత్త ప్రాంతం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వెనకబడిన ప్రాంతాల ప్రాతిపదికతోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నారని, రానున్న రోజుల్లో 25 జిల్లాలను సమాన ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.

English summary
Andhra Pradesh's Excutive capital will be setup at Bheemili in vizag, announced ycp mp vijayasai reddy . it was decided by cm he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X