తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు: ఏపీ ఆలయాల్లో మరణమృదంగం
ఏపీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో పలువురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఇది ప్రైవేటు ఆలయం కావడం వల్ల పెద్దగా ఏర్పాట్లు చేయలేదని సమాచారం.
జిల్లాలోని కాశీబుగ్గలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. కార్తీకమాసం, ప్రబోధిని ఏకాదశి పర్వదినం కావడం వల్ల ఈ తెల్లవారు జాము నుంచి భక్తులు పోటెత్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన చర్యలు, ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన సంభవించిందని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాలం గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోవడం కనిపించింది. స్వామివారి దర్శనానికి వెళ్లే చోట తోపులాట చోటు చేసుకుంది. క్రమంగా అది పెరిగింది. ఆలయం ఆవరణలో స్టీల్ బ్యారికేడ్ సైతం విరిగిపోయిందంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్జీవంగా పడివున్న తమ వారిని బతికించుకోవడానికి కుటుంబ సభ్యులు, తోటివాళ్లు, ఆలయ సిబ్బంది ప్రాథమిక సపర్యలు చేశారు. సీపీఆర్ ఇస్తూ కనిపించారు. అయినప్పటికీ- ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది.
- కాగా ఏపీ ఆలయాల్లో వరుసగా విషాదకర ఘటనలు సంభవిస్తోన్నాయి. తిరుపతిలో తొక్కిసలాట సంభవించిన విషయం తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శన టికెట్లను జారీ చేయడానికి ఏర్పాట చేసిన కౌంటర్ల వద్ద సంభవించిన తొక్కిసలాటలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు.
- దీని తర్వాత.. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రఖ్యాతి చెందిన సింహాచలం ఆలయంలో విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
- ఇప్పుడు తాజాగా కాశీబుగ్గలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదిమంది మరణించారు. చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. కార్తీకమాసం, ప్రబోధిని ఏకాదశి పర్వదినం కావడం వల్ల ఈ తెల్లవారు జాము నుంచి భక్తులు పోటెత్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన చర్యలు, ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన సంభవించింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications