వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బులిచ్చిన స్త్రీలు, బయడపడతాం: బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అయినా సంక్షోభం నుండి బయటపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రుణమాఫీ అమలు చేసి రైతులకు అండగా ఉంటామన్నారు.

పోలవరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామన్నారు. బాధితులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే బాధ్యత తనదేనని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నుండి బయట పడతామన్నారు. పైరవీకారులను దరి చేరనివ్వమని, పేదలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు.

విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఇబ్బందులను అధిగమిస్తామని చెప్పారు. పోలవరం విషయమై కొందరు అనవసర రాజకీయం చేస్తున్నారన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు పేదవారి కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు.

పరిపాలన ప్రజలకు అందాబుటులో ఉండేలా జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం దళారులకు, పైరవీకారులకు పెద్దపీట వేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పేదవారి కోసం పని చేస్తుందన్నారు. బెల్టుషాపులు రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి చేస్తానని చెప్పారు. హైదరాబాదును మించిన నాలుగు నగరాలను ఏపీలో నిర్మిస్తామన్నారు.

రుణమాఫీ పైన వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. అన్ని ఎన్నికల్లో గెలిపించిన పశ్చిమ గోదావరి అంటే ప్రత్యేక అభిమామన్నారు. ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు.

డ్వాక్రా మహిళలతో బాబు

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో సమావేశమయ్యారు. ఆరేపాటిదిబ్బలులో ఆయన మాట్లాడుతూ... ఆనాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలను చదువుకోవాలని చెప్పానన్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు పిల్లలను స్కూలుకు పంపుతున్నారని, వారి కృషి వల్లే అక్షరాస్యత పెరిగిందన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జనాభా నియంత్రణ ఘనత డ్వాక్రా సంఘాల మహిళలదేనని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి కావాలన్నారు. ఆర్థిక వ్యవస్థనే శాసించగల శక్తి డ్వాక్రా మహిళలకు ఉందన్నారు. మన సంఘాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎవరి పైనా ఆధారపడవద్దన్నారు. సొంత తెలివితేటలతో ముందుకు వెళ్లాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతానని చంద్రబాబు అన్నారు. స్థానిక వనరులను మరింతగా వినియోగిస్తామన్నారు.

ఆర్బీఐకి లేఖ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఖరీఫ్‌తో పాటు రబీ రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆర్బీఐకి విన్నవించింది. లక్షన్నర వరకు బంగారం రుణాలు, వ్యవసాయ రుణాల మాఫీకి నిర్ణయించుకున్నామని ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ కు తెలిపింది.

డ్వాక్రా సంఘాల విరాళం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పలువురి నుంచి విరాళాలు అందుతున్నాయి. తాజాగా డ్వాక్రా సంఘాలు రూ.62 లక్షల విరాళాన్ని ఇచ్చాయి. ఈ మొత్తాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.

మాగంటి

మాగంటి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఆయనకు మాగంటి బాబు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు స్థానిక నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. పక్కన మాగంటి బాబు నవ్వుతూ...

టీడీపీ

టీడీపీ

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యం. పక్కన సీనియర్ నేత మాగంటి బాబు.

చంద్రబాబు

చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ అధికార కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ అధికార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఫైలు చూస్తూ..

జెడ్పీ

జెడ్పీ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఆయనకు ఏదో చెబుతున్న డెజ్పీ చైర్మన్ బాబు రాజు.

కలెక్టర్

కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి గూడెంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న కలెక్టర్ దృశ్యం.

జేసీ స్వాగతం

జేసీ స్వాగతం

పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి గూడెంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న జాయింట్ కలెక్టర్ దృశ్యం.

English summary
Andhra Pradesh is facing problems after division, says Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X