ఏపీలో మొదలైన ఫ్రీ బస్సు కష్టాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఉచిత బస్సు పథకం, మహిళలకు ఆర్థికంగా ఊరటనిచ్చినప్పటికీ, కొన్ని చోట్ల అసౌకర్యాలకు దారితీస్తోంది. పథకం ప్రారంభమైన మూడు రోజులు ప్రశాంతంగా సాగగా, తాజాగా బస్సుల్లో సీట్ల కోసం మహిళల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు మొదలయ్యాయి.

విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న ఓ బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళలు వాదులాడుకున్నారు. ఈ వాదనలు ముదిరి పరస్పరం బూతులు తిట్టుకునేంత వరకు వెళ్లాయి. కొట్టుకునేంత పని జరగగా, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

AP Free Bus Scheme Seat Wars Erupt as Women Clash on a Bus

ఈ సంఘటనపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. తెలంగాణలో ఉచిత బస్సు పథకం ప్రారంభమైనప్పుడు ఇలాంటి గొడవలే జరిగాయని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఏపీలో కూడా "మహిళల యుద్ధాలు" మొదలయ్యాయని కొందరు కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరిన్ని చూసే అవకాశం ఉందని పోస్టులు పెట్టారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలకు ప్రయాణ సౌకర్యం పెరిగినా, బస్సుల్లో రద్దీని, అసౌకర్యాన్ని నివారించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+