జగన్ నివాసానికి జీఏడీ అధికారులు - ఏం జరుగుతోంది..!!
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. నూతన అసెంబ్లీ కొలువు తీరింది. మాజీ సీఎం జగన్ సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష హోదా లేకపోవటంతో సభలో చివరి వరుసలో జగన్ ఆశీనులయ్యారు. ఇదే సమయంలో ఫర్నీచర్ రాజకీయం వేడెక్కుతోంది. ప్రభుత్వ సొమ్ముతో జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ కొనుగోలు చేసారని..తిరిగి అప్పగించాలనే చర్చ సాగుతోంది. ఈ సమయంలోనే అధికారులు జగన్ నివాసానికి చేరుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. జగన్ ప్రభుత్వ సొమ్ముతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఫర్నీచర్ కొనుగోలు చేశారని.. అయితే ప్రభుత్వం మారినప్పటికీ ఇంకా వాటిని తిరిగి అప్పగించలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఫర్నీచర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు లేఖ రాశామని.. విలువ కట్టి చెప్తే ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వైసీపీ నేతలు కూడా ధీటుగా స్పందించారు.ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ను వెంటనే తమకు అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం జగన్‌కు లేఖరాసింది.

ఏపీ ప్రభుత్వం నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు ఈ లేఖ రాశారు. అలాగే జగన్ హయాంలో సీఎంవోలో పనిచేసిన సెక్రటరీలకు కూడా లేఖలు పంపినట్లు సమాచారం. ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతరత్రా సామాగ్రిని వెనక్కి పంపాలని లేఖలో పేర్కొన్నారు. ఫలితాలు వచ్చిన 15 రోజుల్లోగా వాటిని సరెండర్ చేయాలని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫర్నీచర్ వెనక్కి పంపాలంటూ జీఎడీ అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది. ఇదే సమయంలో జీఏడీ అధికారులు జగన్ నివాసంలో రెండు అంతస్థుల్లో ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్ వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications