ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన..!!

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయం కావటంతో మార్చిలోనే పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్, మార్చి 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి మొదలవుతాయి. తొలి రోజున ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. 19న సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు నిర్ణయించారు. మార్చి 20న ఇంగ్లీషు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 22న గణితశాస్త్రం పరీక్ష జరగనుంది. 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయోలాజికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, మార్చి 30న ఒకేషనల్ కోర్సు పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేసారు. ఏడు సబ్జెక్టులకే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.

AP Government Announces Tenth and inter Exams Schedule, to begin on march 1st

ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికల కారణంగా విద్యార్దులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంటర్ తో పాటుగా పదో తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్సా వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు 6 లక్షల మంది..ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మంది హాజరవుతారని వివరించారు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్:
మార్చి 1న ఫస్ట్ ఇయర్ సెకండ్ లాగ్వేంజ్, మార్చి 4న ఇంగ్లీష్, మార్చి 6న మేథమేటిక్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 9న మేథమేటిక్స్ 1బీ, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 నిర్వహణకు నిర్ణయించారు. మార్చి 12న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి. మార్చ 14న కెమిష్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ అర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 పరీక్ష్లలు జరుగుతాయి. మార్చి 16న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జికోర్సు మేథ మేటిక్స్ పేపర్ 1, 19ప మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణలో భాగంగా..మార్చి 2న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, మార్చి 5న ఇంగ్లీషు పేపర్, మార్చి 7న మేథమేటిక్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 జరగనున్నాయి. మార్చి 11న మేథమేటిక్స్ పేపర్ 2 బీ, జూవాలజీ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరగుతాయి. మార్చి 13న ఫిజిక్స్ పేపర్ 1,ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న కెమిష్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ - మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జి కోర్సు పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.మార్చి 20న చివరగా మెడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+