ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ : ఈ నెలలోనే చెల్లింపులు..!!

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన స్పష్టత ఇచ్చింది.

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన స్పష్టత ఇచ్చింది. వారికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. కోవిడ్‌వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. చర్చల ద్వారానే ఆయా సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అందులో భాగంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపైన కీలక నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నెలాఖరులోగా రూ 3 వేల కోట్ల చెల్లింపు

ఈ నెలాఖరులోగా రూ 3 వేల కోట్ల చెల్లింపు

ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఇటు ప్రభుత్వం వారికి సమస్యల పరిష్కారం పైన స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆర్దిక అంశాలకు సంబంధించి నిర్ణీత గడువుతో చెల్లింపులు చేస్తామని చెప్పింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమేం ఎప్పటికప్పుడు చర్చించేందుకే సీఎం జగన్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగిస్తున్నారని మంత్రులు ఉద్యోగ సంఘ నేతలకు వివరించారు.

ఉద్యోగులు ఏ విషయాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటుచేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందన్నారు. చర్చల్లో భాగంగా ప్రధాన డిమాండ్ గా ఉన్న బకాయిల చెల్లింపు పైన ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగులకు ఈ నెల 31లోగా రూ.3 వేల కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆర్దిక పరమైన ఇతర అంశాలతో పాటుగా పెండింగ్ అంశాల పైన చర్చ జరిగింది. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైంది.

రెండు విడతులగా డీఏ...లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌

రెండు విడతులగా డీఏ...లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌

ఇప్పటివరకు ఉన్న జీపీఎఫ్‌ పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. రిటైర్మెంట్‌కి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను పూర్తిగా చెల్లిస్తామన్నారు. మెడికల్‌ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు. టీఏ, ఏపీజీఎల్‌ఐ కూడా ఇస్తామన్నారు. ఆర్థికపరమైన అన్ని అంశాలపై చర్చించారు. మహిళా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 5 స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వడానికి మంత్రి వర్గ ఉప సంఘం సానుకూలంగా స్పందించింది.

2004కు ముందు ఎగ్జామ్స్‌ పాస్‌ అయిన వాళ్లకు సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారడానికి అనుమతించడానికి సూత్ర ప్రాయంగా అంగీకారం కుదిరింది. వీటితో పాటుగా వీఆర్‌ఏలకు డీఏ పునరుద్ధరణ, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి ఉత్తర్వులు ఇవ్వడానికీ ఒప్పుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేష్

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేష్

ఈ చర్చల్లో భాగంగా మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ..వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు, రెండో దశలో నియామకమైన వారికి త్వరగా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు మంత్రి వర్గ ఉప సంఘం అంగీకరించింది. గ్రేడ్‌-2 వీఆర్‌వోలకు ప్రొబేషన్‌ డిక్లరేషన్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. గత ప్రభుత్వం కక్ష సాధింపుగా ఉద్యోగుల మీద పెట్టిన ఏసీబీ కేసుల్లో బాధితులకు త్వరగా న్యాయం చేయాలని నేతలు కోరారు.

ఈ ఉగాదికి ఒక డిఏ విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసకుంటామని చెప్పారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని కోరినట్లు ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు. ఆరోగ్య కార్డుల సమస్యలపైన ఈ నెల 16న సమావేశం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+