Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ బాటలోనే మేమూ.. ! చంద్రబాబు, పవన్, లోకేష్ క్లారిటీ..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ విచ్చలవిడిగా హెలికాఫ్టర్లను వాడుతున్నారనే ప్రచారాన్ని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పదే పదే తెరపైకి వచ్చేవారు. ప్రజా ధనాన్ని అప్పటి సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు చేసేవారు. సీన్ కట్ చేస్తే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హెలికాఫ్టర్లు వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దీంతో గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్, ఇప్పుడు కూటమి పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ హెలికాఫ్టర్ల వినియోగాన్ని పోలుస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వైఎస్ జగన్ వాడిన దాని కంటే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ ల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా ఉందనేది వాటి సారాంశం. అంతే కాదు ఈ హెలికాప్టర్ల కోసం కూటమి ప్రభుత్వం పెడుతున్న ఖర్చును కూడా జీవోలు, అంకెల రూపంలో ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారు.

ap government clarified to over usage of helicopters by chandrababu pawan kalyan and nara lokesh

వీటిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ హెలికాఫ్టర్ల వాడకంపై వస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చింది. అయితే ఇందులో " ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెలికాప్టర్ ల నిర్వహణ కోసం రూ.54 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియే అని తెలిపింది.

ap government clarified to over usage of helicopters by chandrababu pawan kalyan and nara lokesh

రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం, నిర్వహణ కోసం, ఏవియేషన్ కార్పోరేషన్ కి ప్రతి ఏడాది రూ.50 కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుందని ఇందులో వెల్లడించారు. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా రూ.55 కోట్లు ఒక ఏడాదిలో, మరో ఏడాదిలో రూ.52 కోట్లు అనేది కేటాయించి, ప్రతి క్వార్టర్ కి నిధులు విడుదల చేసారని తెలిపారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియ అని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+