అమరావతిలో జడ్డీలు, మంత్రుల ఇళ్లకు అడుగు రూ.10 వేలు ? సర్కార్ క్లారిటీ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో నిర్మాణాల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గతంలో వేసిన అంచనాల మేరకు కొన్ని, సవరించిన అంచనాలతో మరికొన్ని నిర్మాణాలకు టెండర్లు పిలిచి వాటిని ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందులో భాగంగా జడ్డీలు, మంత్రుల నివాసాలకు భారీ ఎత్తున ఖర్చుపెట్టబోతున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది.
అమరావతి రాజధానిలో భవిష్యత్తులో కీలకమైన మంత్రులు, జడ్డీల నివాసాలకు చదరపు అడుగుకు ఏకంగా రూ.10042 ఖర్చు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచ బ్యాంక్ తో పాటు ఏడీబీ నుంచి దాదాపు రూ.15 వేల కోట్ల రుణం రాగానే ఈ నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తాజాగా స్పందించారు. ఆ వార్తలు నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చారు.

అమరావతి రాజధానిలో జడ్జిలు, మంత్రుల నివాసాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.10,042 ఖర్చు చేస్తున్నట్లు పూర్తిగా అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా చదరపు అడుగుకు రూ.4,382 ఖర్చు చేయాలని ఇంజినీర్ల, నిపుణుల కమిటీ సూచించింది. ఆ సూచనల మేరకే ఖర్చు పెట్టనున్నారు. అసత్య ప్రచారం… pic.twitter.com/VeiQ4yQJJ7
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 1, 2025
అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్స్ లో ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అమరావతి రాజధానిలో జడ్జిలు, మంత్రుల నివాసాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.10,042 ఖర్చు చేస్తున్నట్లు పూర్తిగా అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. వాస్తవంగా చదరపు అడుగుకు రూ.4,382 ఖర్చు చేయాలని ఇంజినీర్ల, నిపుణుల కమిటీ సూచించిందని, ఆ సూచనల మేరకే ఖర్చు పెట్టనున్నారని వెల్లడించింది. అసత్య ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ పోస్టుకు మంత్రి నారాయణ మాట్లాడుతున్న వీడియో కూడా జత చేసింది.












Click it and Unblock the Notifications