టీడీపీకి ఓటేసినందుకే...12 ఏళ్లు జైలు శిక్ష:ఓ ఖైదీ గోడు...41 మందికి క్షమాభిక్ష

అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షపెట్టడంతో వివిధ సెంట్రల్ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న పలువురిని జైలు అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఇలా నాలుగు జైళ్ల నుంచి 41 మందిని విడుదల చేశారు.

ఊహించని విధంగా క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన ఖైదీలు పట్టరాని సంతోషంతో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఇలా విడుదలైన వైఎస్ రాజారెడ్డి హత్యకేసు నిందితుడు...పులివెందులకు చెందిన రాగిపిండి సుధాకర్‌రెడ్డి అనే ఖైదీ మాట్లాడుతూ కేవలం టిడిపికి ఓటేసినందుకే తనపై అప్పటి రాజకీయ నేతలు కక్ష కట్టి హత్యేసులో ఇరికించారని, దీంతో 12 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని చెప్పాడు.

ఖైదీలకు...క్షమాభిక్ష

ఖైదీలకు...క్షమాభిక్ష

రాష్ట్రంలోని వివిధ సెంట్రల్ జైళ్లలో మగ్గుతున్న 41 మంది జీవిత ఖైదీలకు ఎట్టకేలకు సంపూర్ణ స్వేచ్చ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో ఈ విధంగా వివిధ కేంద్ర కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న ఆ 41 మందిని జైలు అధికారులు ఆదివారం విడుదల చేశారు. విశాఖ కేంద్ర కారాగారం నుంచి 13 మంది, రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి 18 మంది, కడపలో 7, నెల్లూరులో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెట్టిన క్షమాభిక్ష ద్వారా విడుదలయ్యారు.

 జనవరి 26...ప్రభుత్వం నిర్ణయం

జనవరి 26...ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో అర్హులైన ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేయాలని ఈ ఏడాది జనవరి 26న ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల జైలుశిక్ష, మూడేళ్ల రెమిషన్‌ కాలాన్ని పూర్తిచేసి, సత్ప్రవర్తన కలిగిన, క్షమాభిక్షకు అర్హులైనవారి జాబితాను పంపాలని రాష్ట్ర జైళ్ల శాఖ వివిధ సెంట్రల్ జైళ్ల అధికారులను దేశించింది. ఈమేరకు అర్హుల జాబితాను తయారుచేసి, జైలు అధికారులు నివేదిక పంపారు. పలు అభియోగాలు, అభ్యంతరాలు ఉన్నవారి పేర్లు తొలగించి, మిగిలిన వారిని విడుదల చేసేశారు.

అంతటా...భావోద్వేగాలే

అంతటా...భావోద్వేగాలే

అనూహ్యంగా జైలు నుంచి విడుదలైన జీవిత ఖైదీలు తమ కుటుంబాలను వెంటనే చూడాలని ఆతృతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జైలు గేటు దాటి బైటకు అడుగు పెట్టడంతోనే చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యారు. తమకు స్వేచ్చ లభించిందన్న నిజం నమ్మశక్యం కానట్లుగా ఉందని, అంతా కలలా ఉందని కన్నీళ్లు పెట్టకుంటున్నారు. జైల్లో శిక్ష అనుభవిస్తుండగా ఖైదీలకు వివిధ చేతివృత్తులలో శిక్షణ ఇచ్చామని రాజమహేంద్రవరం జైలు సూరింటెండెంట్‌ రాహుల్‌ ఈ సందర్భంగా తెలిపారు. జైల్లో ఉండగా వారు సంపాదించిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని రాహుల్‌ చెప్పారు.

టిడిపికి...ఓటేసాననే!

టిడిపికి...ఓటేసాననే!

నెల్లూరు జైలు నుంచి విడుదలైన వారిలో వైఎస్‌ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. జైలు నుంచి బైటకు వచ్చిన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..."పులివెందులతెలుగుదేశం పార్టీకి ఓటేసినందుకే నన్ను రాజారెడ్డి హత్యకేసులో ఇరికించి జైలు పాలు చేశారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న నాపై నాటి రాజకీయ నేతలు కక్షగట్టి 13వ ముద్దాయిగా ఇరికించారు. 1998లో జరిగిన ఈ హత్యకు సంబంధించి 2006లో నాకు శిక్ష పడింది. 11 సంవత్సరాల పది నెలలు జైలు జీవితం గడిపాను. కుటుంబానికి దూరమవడంతోపాటు ఆర్థికంగా చితికిపోయాను. ఊరికి వెళ్లాక వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడుపుతాను"...అని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+