జగన్ సీఎం కలగానే, 3,500 సేకరించాం: నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణ పైన ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్ట అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 30వేల ఎకరాల భూమి అవసరమన్నారు.

అందులో ప్రస్తుతం 3,500 ఎకరాల భూమిని సేకరించినట్లు చెప్పారు. చాలామంది రైతులు స్వచ్ఛంధంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కావాలని కలలు గన్న జగన్ కల, కలగానే మిగిలిపోతుందన్నారు.
రాజధాని ఏఱ్పాటు దృష్ట్యా అదనపు సిబ్బంది కేటాయింపును పరిశీలిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ఆయన విజయవాడలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ పైన దృష్టి పెట్టామని, కమిషనరేట్ పరిధి పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications