మధ్యాహ్న భోజనం పథకం అమలుపై ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తరు వాత గత ప్రభుత్వ అమలు చేసిన పథకాలకు పేర్లు మార్పు చేసింది. పాఠశాలల్లో అమలు చేస్తు న్న మధ్నాహ్న భోజన పథకం ఇప్పుడు విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇంటర్ విద్యార్ధులకు ఇక కళాశాలల్లోనే మధ్నాహ్న భోజనం అందించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని నిర్ణయించారు.
కూటమి ప్రభుత్వం మధ్నాహ్న భోజనం పథకం విస్తరణకు నిర్ణయించింది. ఇప్పటి వరకు పాఠశాలల్లో అమలవుతున్న ఈ పథకం ఇక ఇంటర్ కళాశాలల్లోనూ అమలు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ప్రకటన చేసారు. కాలేజీల్లో విద్యార్ధుల హాజరు .. విద్యా ప్రమాణాల మెరుగు దల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కళాశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని విద్యా శాఖ సమీక్ష వేళ అభిప్రాయం వ్యక్తమైంది. ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా దానిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని లోకేశ్ చెప్పారు.

అదే విధంగా ఇంటర్ లో వెనుకబడిన విద్యార్థులకు ప్రశ్న బ్యాంకు అందించాలని అధికారులకు సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల ఎసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని నిర్దేశించారు. ఈ మేరకు కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ వారికి పర్యవేక్ష కులుగా నియమించాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని లోకేష్ స్పష్టం చేసారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వతేదీన నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీటిని పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలకు హాజరవుతారని వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా పార్టీల జెండాలు.. రాజకీయ ఆర్భాటాలకు తావీయొద్దని స్పష్టంచేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పిటిఎం కు ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు తాను కూడా హాజరవుతానని చెప్పారు. 10వతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపర్చేందుకు 100రోజుల ప్రణాళికను అమలు చేయాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ కరిక్యులమ్ ప్రక్షాళనపై అధికారులతో చర్చ జరిగింది. అదే విధంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications