ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. విద్యా శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వుల రద్దుకు నిర్ణయించింది. ఉపాధ్యాయుల బదిలీలతోపాటు పదోన్నతులకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అనేక సంస్కరణలను తీసుకురానుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు రకాల బడుల విధానాన్ని రద్దుచేసి ఆ స్థానంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విధానాన్ని తీసుకురావాలని భావిస్తుంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి బడులను పటిష్టం చేయటం పైన ఫోకస్ చేసింది.

AP Government decided to make changes in teachers transfer and promotions system

ఉపాధ్యాయుల సర్దుబాటు, తరగతుల విలీనం అంటి విధానాల్లో పూర్తి మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేసిన 3,4,5 తరగతులను వెనక్కి తీసుకురానున్నారు. వీటిని ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలను తయారు చేయాలని నిర్ణయించారు.

ఇక ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తరాలను రద్దు రద్దు చేయాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. బదిలీలతోపాటు పదోన్నతులకు ప్రత్యేకంగా చట్టం చేయనున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సృష్టించి బదిలీలు నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు బదిలీలు పదోన్నతులు కల్పించి ఆ తర్వాత డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన చట్టం తుది దశకు చేరింది. కొద్దిపాటి మార్పులతో కర్ణాటక తరహ విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+