ఏపీలో ఇక అనాథలకు పెన్షన్-చంద్రబాబు కీలక నిర్ణయం..!
ఏపీలో పెన్షన్ల పంపిణీ, లబ్దిదారులపై ఇవాళ అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ఉదయం జరిగిన సెషన్ లో పెన్షన్ల లబ్దిదారుల్లో అనర్హుల ఏరివేత, ఇతర మార్పులు సూచించిన చంద్రబాబు, అనంతరం తల్లితండ్రులు లేని చిన్నారులకు సైతం పెన్షన్లు ఇవ్వాలని కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో వీరికి పెన్షన్లు లభించడం లేదు.
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇవాళ కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ ల సమావేశంలో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రాష్ట్రంలో 3 నెలల్లో అన్నార్తులను గుర్తించి పింఛను కల్పించాలని స్పష్టం చేశారు. ఆ తరువాత కూడా ప్రతి ఏడాది అన్నార్తుల జాబితాను అప్‌డేట్ చేయాలని సూచించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అన్నార్తులకు పింఛను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబుకు తెలిపారు.

రాష్ట్రంలో కరోనాలో తల్లితండ్రులు కోల్పోయిన చిన్నారులకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వాలు పలు రకాలుగా సాయం చేసాయి. వారిని ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు విద్యాభ్యాసం విషయంలోనూ సాయం చేసాయి. అయితే ఇంకా చాలా మందికి ఈ సాయం అందలేదు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లను వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో విధివిధానాలు రూపొందించబోతున్నారు.












Click it and Unblock the Notifications