ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులివే..! ఎవరెవరికి ఎలా ..?

ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవుల్ని ప్రకటించారు. గతంలో ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా ఏయే స్కూల్స్ కు ఏ విధంగా సెలవులు ఇస్తున్నారో వివరాలను అధికారులు ఉత్తర్వులు పంపుతున్నారు. వీటిలో రెగ్యులర్ స్కూల్స్ కు ఓ విధంగా, క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలకు మరో విధంగా సెలవులు ఇస్తున్నారు.

రాష్ట్రంలో ప్రతీ ఏటా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు. అయితే ఇందులో రెగ్యులర్ పాఠశాలలతో పోలిస్తే క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ కు కొంత తక్కువ సెలవులు ఇస్తుంటారు. డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా వారికి సెలవులు ఉంటాయి కాబట్టి విద్యాసంవత్సరంలో పనిదినాలను బ్యాలెన్స్ చేసేందుకు ఇలా చేస్తుంటారు. ఈ క్రమంలో ఎవరెవరికి ఎలా సెలవులు ఇచ్చారో ఓసారి చూద్దాం..

ap government declare Sankranti holidays to schools- here are details

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీ శుక్రవారం నుంచి రెగ్యులర్ స్కూల్స్ కు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవి జనవరి 19తో ముగుస్తాయి. తిరిగి జనవరి 20వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి.

ఈ లెక్కన పది రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లయింది. మరోవైపు క్రిస్టియన్ పాఠశాలలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది. దీంతో వీరికి కేవలం ఐదు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. వీరు తిరిగి 16న పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+