అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు-విద్యాశాఖ ప్రకటన-ఎప్పటివరకంటే ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో సాధారణ ప్రజలతో పాటు స్కూళ్లకు వెళ్లి పిల్లలు సైతం అల్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఒంటిపూట బడులే కొనసాగుతున్నా మిట్టమధ్యాహ్నం ఇంటికి చేరుకునే సరికి పిల్లలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవులపై కీలక ప్రకటన చేసింది.

ఈ ఏడాది మే 6 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో మే 6వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది. ఇందుకోసం వచ్చే నెల 4లోగా 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని కమిషనర్‌ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 4వ తేదీన పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ap government declare summer holidays to schools from may 6

రెండేళ్లుగా కరోనా కారణంగా ఏపీలో విద్యాసంవత్సరంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సిలబస్ తగ్గింపులు, సెలవుల కుదింపుతో పాటు విద్యాసంవత్సరాన్ని సైతం ముందుకు జరుపుతున్నారు. పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్ధులను పాస్ కూడా చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సి ఉండగా.. అది కాస్తా మే 6వరకూ పొడిగించాల్సి వచ్చింది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారుల నుంచి స్కూళ్లకు ఆదేశాలు అందాయి.

English summary
ap government has announced summer holidays to all schools in the state from may 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X