AP CURFEW- మరిన్ని సడలింపులు- ఆ 8 జిల్లాల్లోనే- ఎక్కడెక్కడో తెలుసా ?

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కొత్త కేసుల కంటే డిశ్చార్జ్ ల సంఖ్య ఎక్కువగా ఉండటం, కర్ఫ్యూీ ఆంక్షల ప్రభావం ఫలించడంతో ఇక మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కోవిడ్ పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఇక మరిన్ని ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 8 జిల్లాల్లో ఈ మినహాయింపులు అమల్లోకి రానున్నాయి.

Recommended Video

    AP Curfew Restrictions Eased | Oneindia Telugu

    ఏపీలో ప్రస్తుతం గోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఇవి కాకుండా మిగిలిన 8 జిల్లాల్లో ఆంక్షల్ని సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు అమల్లోకి రానున్నాయి. గోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు కొనసాగుతాయి.

    ap government eases curfew restrictions in 8 districts, relaxation timings from 6am to 9pm

    కర్ఫ్యూ మినహాయింపులు పెంచిన 8 జిల్లాల్లో రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేస్తారు. రాత్రి కర్ఫ్యూ ఎలాగో అమల్లోనే ఉంటుంది ఉదయం 6 గంటల తర్వాతే తిరిగి సాధారణ కార్యకలాపాలు, రాకపోకలకు అనుమతి ఇస్తారు. ఈ సడలింపులు జులై 1 నుంచి జులై 7 వరకూ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకుంటారు. గతంలో విధించిన ఆంక్షలు ఈ నెల 30 వరకూ యథావిథిగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+