ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు- సర్కారు కీలక ఉత్తర్వులు జారీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వెంటనే పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ మేరకు ఏపీలోనూ ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేస్తోంది.
ఏపీలోకరోనా వ్యాక్సిన్ పంపిణీ సజావుగా జరిగేందుకు వీలుగా అర్బన్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ కమిషనర్ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్ధాయి కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌లోనూ సభ్యుల సంఖ్యను పెంచారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులను చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఉత్తర్వులు, సవరణల మేరకు రాష్ట స్దాయి టాస్క్‌ఫోర్స్‌లో 16 మంది, జిల్లా స్ధాయి టాస్క్ ఫోర్స్‌లో 34మంది సభ్యులు పనిచేస్తారు. వీరి నియామకం కోసం ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఓసారి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఈ టాస్క్‌ఫోర్స్‌లు తమ పని చేయడం ప్రారంభిస్తాయి. వ్యాక్సిన్ సజావుగా పంపిణీ చేయడం, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం, ఎలాంటి సమస్యలు రాకుండా వంటి బాధ్యతలను ఈ టాస్క్‌ఫోర్స్‌లు నిర్వర్తిస్తాయి.












Click it and Unblock the Notifications