Cyclone Michaung: ఏపీలో రేపు కూడా స్కూళ్లకు సెలవు..!

ఏపీలో మిచౌంగ్ తుపాను తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. తుపాను తీరం దాటక ముందే పలు జిల్లాల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు, కాలేజీలకు ఇతర విద్యాసంస్ధలకు సెలవులు ప్రకటించింది. అయితే ఇవాళ బాపట్ల వద్ద మిచౌంగ్ తుపాను తీరం దాటినా భారీ వర్షాలతో రాష్ట్రంలో పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో స్కూళ్లకు ఇచ్చిన సెలవుల్ని విద్యాశాఖాధికారులు పొడిగిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో అన్ని విద్యాసంస్థలకు తుఫాను ఉధృతి రీత్యా రేపు అనగా 6వ తేదీ కూడా సెలవు ప్రకటించినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి తాహెరా సుల్తానా ప్రకటించారు. తుఫాను ను నేపథ్యం లో రేపు అనగా 6 వ తేదీ బుదవారం ఎన్ టి ఆర్ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాటశాలలు , కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల కు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న దృష్ట్యా బుధ వారం కూడా విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ap government extends holidays to schools till tomorrow due to post cyclone Michaung effect

ఇదే క్రమంలో గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ కలెక్టర్లు విద్యాసంస్ధలకు సెలవుల ప్రకటన చేస్తున్నారు. తుపాను తీరం దాటిన తర్వాత కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా తీవ్రంగా వీస్తుండటంతో రోడ్లపై జన సంచారమే లేకుండా పోయింది. భారీగా వీస్తున్న ఈదురుగాలులకు ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+